John Abraham to Tamil debut: తొలిసారిగా తమిళ సినిమాలో అడుగు .. అజిత్ కోసం మళ్ళీ బైక్ రేసర్ గా జాన్ అబ్రహం…

మోడలింగ్ నుంచి వెండి తెరపై అడుగుపెట్టి.. డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఓ ఫేమ్ సంపాదించుకున్న హీరో జాన్ అబ్రహం. ఈ పేరు వినగానే ధూమ్ సినిమా గుర్తుకు వస్తుంది. హీరోతో సమానంగా విలన్ గా నటించిన జాన్ అబ్రహంకి పేరు తెచ్చింది. విలన్ కి కూడా ఫాన్స్ ఉంటారు అని..

John Abraham to Tamil debut: తొలిసారిగా తమిళ సినిమాలో అడుగు .. అజిత్ కోసం మళ్ళీ  బైక్ రేసర్ గా జాన్ అబ్రహం...
Follow us

|

Updated on: Jan 12, 2021 | 2:24 PM

John Abraham to Tamil debut: మోడలింగ్ నుంచి వెండి తెరపై అడుగుపెట్టి.. డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఓ ఫేమ్ సంపాదించుకున్న హీరో జాన్ అబ్రహం. ఈ పేరు వినగానే ధూమ్ సినిమా గుర్తుకు వస్తుంది. హీరోతో సమానంగా విలన్ గా నటించిన జాన్ అబ్రహంకి పేరు తెచ్చింది. విలన్ కి కూడా ఫాన్స్ ఉంటారు అని నిరూపించాడు జాన్ తన నటనతో.. ఇప్పటి వరకూ డబ్బింగ్ సినిమాలతో మాత్రమే దక్షిణాది ప్రేక్షకులకు పరిచమైన జాన్త తొలిసారిగా తమిళ సినిమాలో నటిస్తున్నట్లు టాక్.

తమిళ స్టార్‌ అజిత్‌ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్‌ చిత్రం ‘వలిమై’ బైక్‌ రేసింగ్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు హెచ్‌. వినోద్‌ దర్శకుడు. బోనీ కపూర్‌ నిర్మిస్తున్నారు. ‘ఆర్‌ఎక్స్‌100’ ఫేమ్‌ కార్తికేయ విలన్‌ పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్‌ నటి హ్యూమా ఖురేషీ కథానాయిక. ఈ సినిమాలో బాలీవుడ్‌ హీరో జాన్‌ అబ్రహాం అతిథి పాత్రలో కనిపిస్తారని టాక్‌. ఈ సినిమాలో రేసర్‌ పాత్రలో జాన్‌ కనిపిస్తారట. బైక్స్, బేక్‌ రేసింగ్‌ అంటే జాన్‌ అబ్రహాంకి అమితాశక్తి అన్న సంగతి తెలిసిందే.

ఇక జాన్ దేశభక్తిని చాటిచెప్పే చిత్రాల్లో నటిస్తున్న బాలీవుడ్ నటుల్లో జాన్ అబ్రహం ఒకరు. మద్రాస్ కెఫె, సత్యమేవజయతే, పరమాణు, బాట్లా హౌస్ వంటి చిత్రాలతో జాన్ అబ్రహం మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తాజాగా ప్రభాస్ హీరోగా నటించనున్న సినిమాలో కూడా సలార్ లో జాన్ అబ్రహం విలన్ పాత్రలో నటించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read:  విరుష్క జంటకు శుభాకాంక్షలు చెప్పిన రోహిత్ శర్మ.. మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలంటూ దీవెన