‘పెళ్లి సందడి’ సీక్వెల్ దర్శకుడు తనికెళ్ల భరణి కాదు, మరి ఎవరో తెలుసా..? ఇంట్రస్టింగ్ అప్టేట్

అసలే పెళ్లిళ్ల సీజన్‌ చాలా ఫ్యామిలీస్‌ పెళ్లి పనుల్లోనే బిజీగా ఉన్నాయి. మన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా పెళ్లి సందడితోనే బిజీగా ఉన్నారు.

  • Ram Naramaneni
  • Publish Date - 5:12 pm, Fri, 27 November 20
'పెళ్లి సందడి' సీక్వెల్ దర్శకుడు తనికెళ్ల భరణి కాదు, మరి ఎవరో తెలుసా..? ఇంట్రస్టింగ్ అప్టేట్

అసలే పెళ్లిళ్ల సీజన్‌ చాలా ఫ్యామిలీస్‌ పెళ్లి పనుల్లోనే బిజీగా ఉన్నాయి. మన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా పెళ్లి సందడితోనే బిజీగా ఉన్నారు. వాళ్లింట్లో కూడా పెళ్లి హడావిడి అనుకుంటున్నారేమో.. కాదులేండి. మన రాఘవేంద్రరావు పెళ్లి సందడి సినిమాకు సీక్వెల్ తీస్తున్నారు కదా. అఫ్‌ కోర్స్ ఈ న్యూస్ మీకు ఇప్పటికే తెలుసనుకోండి. అయితే ఈ మూవీ గురించి వైరల్‌ అవుతున్న కొన్ని రూమర్స్‌కు మేమిప్పుడు క్లారిటీ ఇవ్వబోతున్నాం. పెళ్లి సందడి సీక్వెల్‌ను తనికెళ్ల భరణి డైరెక్ట్ చేస్తున్నారన్న న్యూస్ టాలీవుడ్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది అసలు నిజం కాదంట. వాస్తవానికి తనికెళ్ల భరణి.. రాఘవేంద్రరావు గారి బ్యానర్‌లో ఓ సినిమా చేస్తున్న విషయమైతే నిజమే గానీ.. అది పెళ్లి సందడి మాత్రం కాదు. పెళ్లి సందడి సినిమాతో గౌరి అనే కొత్త అమ్మాయి దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.

అంతేకాదు సినిమాలో ముగ్గురు నలుగురు హీరోయిన్లు ఉన్నారన్న టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది. అయితే ఆ న్యూస్‌ కూడా ఫేక్‌ అని అంటున్నారు రాఘవేంద్రుడి టీం.. ఈ మూవీలో ఉండేది ఇద్దరే హీరోయిన్స్‌.. వాళ్లలోనూ ఒకళ్లది జస్ట్ గెస్ట్ రోల్‌. హీరో ఎవరో మీకు తెలుసు కదా.. పాత పెళ్లి సందడి హీరో శ్రీకాంత్ కొడుకు రోషనే ఈ కొత్త పెళ్లి సందడికి హీరో.

Also Read :

ఏపీలో 53 మంది మహిళా జీవిత ఖైదీల విడుదలకు ఉత్తర్వులు, అలా చేస్తే ఆర్డర్స్ రద్దు

నయా ట్రెండ్ సెట్ చేసిన రకుల్, ముద్దుగుమ్మలకు భలే దారి చూపించింది