Vakeel Saab Movie Release Highlights : పవన్ అభిమానుల పండగ మొదలైంది.. ప్రేక్షకుల ముందుకు వచ్చిన వకీల్ సాబ్..

| Edited By: Ram Naramaneni

Apr 09, 2021 | 6:34 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవన్ ను ఎప్పుడెప్పుడు వెండి తెరపైన చూద్దామా అని అభిమానులంతా

Vakeel Saab Movie Release Highlights : పవన్ అభిమానుల పండగ మొదలైంది.. ప్రేక్షకుల ముందుకు వచ్చిన వకీల్ సాబ్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  సినిమా విడుదల రోజే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. 

Vakeel Saab: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవన్ ను ఎప్పుడెప్పుడు వెండి తెరపైన చూద్దామా అని అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. దాదాపు మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కావడంతో అభిమానులు భారీగా సంబరాలు చేసుకుంటున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పింక్ రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో పవన్ లాయర్ గా నటిస్తున్నారు. ఇక ఉదయం 4 గంటల నుంచే కొన్ని ప్రాంతాల్లో పవన్ ఫ్యాన్స్ కి స్పెషల్ షో ఏర్పాటు చేశారు.  పొలిటికల్ ఎంట్రీ తరువాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ కావడం.. అందులోనూ లాయర్ పాత్రలో పవన్ కనిపించడం తో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తమ అభిమాన హీరో కటౌట్స్ కి ఫ్యాన్స్ పాలాభిషేకాలు చేస్తున్నారు.  ఇక విదేశాల్లో కూడా పవన్ మ్యానియా కనిపిస్తుంది.  ఆ హడావుడి  ఏంటో ఇప్పుడు చూద్దాం..

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 09 Apr 2021 12:24 PM (IST)

    అన్నీ చోట్లనుంచి బ్లాక్ బస్టర్ రివ్యూస్ వస్తున్నాయి: దిల్ రాజు

    వకీల్ సాబ్ సినిమా మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ విజయం పై నిర్మాత దిల్ రాజు స్పందిస్తూ.. అన్ని చోట్లనుంచి బ్లాక్ బస్టర్ రివ్యూస్ వస్తున్నాయి చాలా ఆనందంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు.

  • 09 Apr 2021 12:17 PM (IST)

    ఒక్కటే మాట బ్లాక్ బస్టర్ : యంగ్ హీరో నిఖిల్

    టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ వకీల్ సాబ్ సినిమాను చూసారు. స్వతహాగా పవన్ అభిమాని అయిన నిఖిల్ వకీల్ సాబ్ ఫస్ట్ డేనే సినిమా చేసేసారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఓ పోస్ట్ షేర్ చేశారు.

     

  • 09 Apr 2021 12:14 PM (IST)

    సినిమాను పాస్ చేయించి పవన్ కళ్యాణ్ కు హారతులు ఇచ్చిన ఫ్యాన్స్

    విదేశాల్లో పవన్ క్రేజ్ వేరే లెవల్..క్యాలిఫోర్నియాలో వకీల్ సాబ్ సినిమాను పాస్ చేయించి పవన్ కళ్యాణ్ కు హారతులు ఇచ్చిన అభిమానులు.

  • 09 Apr 2021 12:09 PM (IST)

    మాస్ కా బాప్ వకీల్ సాబ్..: బండ్ల గణేష్

    పవర్ స్టార్ ప్రియా భక్తుడు బండ్లగణేష్ వాకీల్ సాబ్ సినిమా పై స్పందించారు. మాస్ కా బాప్ వకీల్ సాబ్ అంటూ రాసుకొచ్చారు బండ్ల. నో వర్డ్స్.. నో ఆర్గ్యుమెంట్ ఓన్లీ జడ్జ్ మెంట్ బ్లాక్ బస్టర్ హిట్ జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ పోస్ట్ చేశారు బండ్లగణేష్.

  • 09 Apr 2021 11:33 AM (IST)

    నిడదవోలులో పవన్ అభిమానులకు ఊరట..

    వకీల్ సాబ్ సినిమా బెనిఫిట్ షోను ప్రదర్శించేందుకు అనుమతులు ఇప్పించవలసినదిగా నిడదవోలు ఎమ్మెల్యే శ్రీ.జి.శ్రీనివాస్ నాయుడు గారిని కోరిన పవన్ అభిమానులు. వెంటనే అధికారులతో మాట్లాడి నిబంధనల ప్రకారం బెనిఫిట్ షోను ప్రదర్శించేలా చూడాలని సూచించారు. ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపి, బెనిఫిట్ షోను వీక్షించడానికి వెనుతిరిగిన అభిమానులు.

  • 09 Apr 2021 10:22 AM (IST)

    ఎమ్మెల్యే ఇంటివద్ద ఆందోళన చేసిన పవర్ స్టార్ ఫ్యాన్స్..

    నిడదవోలులో వకీల్ సాబ్ సినిమా బెనిఫిట్స్ షోను నిలిపివేసినందుకు, ఎమ్మెల్యే ఇంటివద్ద ఆందోళన చేపట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్..


     

  • 09 Apr 2021 10:18 AM (IST)

    ఆదోనిలో పవన్ అభిమానుల అత్యుత్సహం..

    ఆదోనిలో పవన్ అభిమానుల అత్యుత్సహం.. థియేటర్ గేట్లను బద్దలుకోట్టిన అభిమానులు..

  • 09 Apr 2021 10:10 AM (IST)

    థియేటర్ లో రచ్చ చేసిన నిర్మాత దిల్ రాజు..

    శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా తొలి షో నుంచే ఆకట్టుకుంటోంది. థియేటర్ల వద్ద పవన్‌ అభిమానుల సందడి ఆకాశాన్ని తాకుతోంది. దీంతో టాప్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజు తన ఖాతాలో మరో భారీ విజయాన్ని వేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక నిర్మాతగా మారినప్పటి నుంచి పవన్‌తో ఓ సినిమా తీయాలని దిల్‌ రాజుకు కోరిక ఉండేదని ఇటీవల జరిగిన వకీల్‌ సాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చెప్పుకొచ్చారు. గురువారం రాత్రి హైదారబాద్‌లో ఏర్పాటు చేసిన బెనిఫిట్‌ షోలో పాల్గొన్న ఈ టాప్‌ ప్రొడ్యూసర్‌ చిందులు వేశారు. సగటు అభిమానిలా మారిపోయి పేపర్లు విసురుతూ సందడి చేశారు.

  • 09 Apr 2021 10:06 AM (IST)

    విదేశాల్లోనూ ఊపేస్తున్న వకీల్ సాబ్..

    విదేశాల్లోనూ ఊపేస్తున్న వకీల్ సాబ్… అట్లాంటా యూఎస్ లో అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రీమియర్ షో నుంచి హిట్ టాక్ తో దూసుకుపోతున్న సినిమా.

  • 09 Apr 2021 09:58 AM (IST)

    వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో…

    ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్న వకీల్ సాబ్.. పవన్ వన్ మ్యాన్ షోతో రచ్చచేసాడంటున్న అభిమానులు..

  • 09 Apr 2021 09:54 AM (IST)

    ప్రభంజనం సృష్టిస్తున్న పవన్ కళ్యాణ్ వాకీల్ సాబ్

    ప్రభంజనం సృష్టిస్తున్న పవన్ కళ్యాణ్ వాకీల్ సాబ్.. మొదటి షోనుంచే హిట్ టాక్. భారీ ఓపెనింగ్ రాబట్టే అవకాశం ఉంది.

  • 09 Apr 2021 09:41 AM (IST)

    ప్రసాద్ ఇమాక్స్ దగ్గర అభిమానుల సందడి

    ప్రసాద్ ఇమాక్స్ దగ్గర పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్  సినిమా చూడటాని అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. భారీగా ఇమాక్స్ వద్దకు చేరుకుంటున్న ఫ్యాన్స్

  • 09 Apr 2021 08:46 AM (IST)

    వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ హిట్ అంటున్న అభిమానులు

    బ్లాక్ బస్టర్ హిట్ అంటున్న ప్రేక్షకులు, పవన్ కటౌట్ కు పూలాభిషేకాలు, పాలాభిషేకాలతో సంబరాలు చేసుకుంటున్న అభిమానులు.

  • 09 Apr 2021 08:32 AM (IST)

    నటనతో ఆకట్టుకున్న వకీల్ సాబ్ హీరోయిన్స్..

    వకీల్ సాబ్ సినిమాలో నటనతో ఆకట్టుకున్న హీరోయిన్లు అంజలి, నివేదా థామస్, అనన్య.

  • 09 Apr 2021 08:09 AM (IST)

    పవర్ స్టార్ కు పర్ఫెక్ట్ హిట్ వకీల్ సాబ్…

    పవన్ కెరియర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడిందంటున్న అభిమానులు.. పవర్ స్టార్ కు పర్ఫెక్ట్ హిట్ కొట్టాడంటున్న ఫ్యాన్స్

  • 09 Apr 2021 07:55 AM (IST)

    నిడదవోలులో పవన్ అభిమానుల ఆందోళన..

    పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో పవన్ అభిమానుల ఆందోళన.. బెనిఫిట్ షో వేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పవర్ స్టార్ ఫ్యాన్స్

  • 09 Apr 2021 07:48 AM (IST)

    యూఎస్ లో హంగామా చేస్తున్న వకీల్ సాబ్..

    అమెరికాలో హంగామా చేస్తున్న వకీల్ సాబ్ సినిమా.. పవన్ కళ్యాణ్ ప్రభంజనం మొదలు అంటున్న అభిమానులు.

  • 09 Apr 2021 07:43 AM (IST)

    బద్వేల్ లో పవన్ అభిమానుల అత్యుత్సహం…

    బద్వేల్ లో పవన్ అభిమానుల అత్యుత్సహం .. థియేటర్స్ కుర్చీలను విరగోట్టిన అభిమానులు.. అల్లరి మూకను బయటకు పంపేసిన థియేటర్స్ యాజమాన్యం.

  • 09 Apr 2021 07:40 AM (IST)

    రికార్డులన్నీ తిరిగిరాయడం ఖాయం అంటున్న ఫ్యాన్స్

    టాలీవుడ్ రికార్డులన్నింటినీ వకీల్ సాబ్ తో తిరగరాయడం ఖాయం అంటున్న పవర్ స్టార్ ఫ్యాన్స్…

  • 09 Apr 2021 07:30 AM (IST)

    జై పవర్ స్టార్ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్న ఫ్యాన్స్

    థియేటర్స్ వద్ద జై పవర్ స్టార్ .. జై జై పవర్ స్టార్ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్న ఫ్యాన్స్.. పవన్ కళ్యాణ్ కు అసలైన కంబ్యాక్ అంటున్న అభిమానులు

  • 09 Apr 2021 07:25 AM (IST)

    కోర్ట్ సీన్స్ లో కుమ్మేసిన పవన్..

    ముఖ్యంగా సెకండ్ ఆఫ్ లో కోర్ట్ సీన్స్ లో పవన్ తనదైన డైలాగ్ డెలివరీతో రక్తి కట్టించారంటున్న ప్రేక్షకులు. ప్రకాష్ రాజ్ కూడా ఎక్కడా తగ్గకుండా నటించారంటున్న  ఫ్యాన్స్.

  • 09 Apr 2021 07:21 AM (IST)

    తమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో థియేటర్స్ దద్దరిల్లుతున్నాయి..

    సినిమాకు మరో హైలైట్ తమన్ అందించిన సంగీతం అంటున్నారు వకీల్ సాబ్ చూసిన ప్రేక్షకులు. ముఖ్యంగా పవన్ ఎలివేషన్స్ కు తమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్తో థియేటర్స్ దద్దరిల్లుతున్నాయంటున్న అభిమానులు.

  • 09 Apr 2021 07:14 AM (IST)

    సినిమా అదిరిపోయిందంటున్న అభిమానులు

    ఇప్పటికే విదేశాల్లో సందడి చేస్తున్న వకీల్ సాబ్ సినిమా..సినిమా అదిరిపోయిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్న అభిమానులు.  ఫస్ట్ ఆఫ్ ను మించి సెకండ్ ఆఫ్ ఉందంటున్న ఫ్యాన్స్.

  • 09 Apr 2021 07:04 AM (IST)

    మూడేళ్ళ తర్వాత వెండితెర పై కనిపిస్తున్న పవన్

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత వెండితెర పై కనిపిస్తున్న సినిమా అభిమానుల్లో ఆనందం హద్దులు దాటింది. .

  • 09 Apr 2021 07:02 AM (IST)

    అర్ధరాత్రి నుంచే హడావుడి చేస్తున్న అభిమానులు 

    కూకట్ పల్లి విశ్వనాథ్ థియేటర్ వద్ద పవన్ అభిమానుల సందడి. అర్ధరాత్రి నుంచే హడావుడి చేస్తున్న అభిమానులు

  • 09 Apr 2021 06:56 AM (IST)

    పవన్ అభిమానుల వీరంగం… థియేటర్‌పై రాళ్లదాడి

    బెనిఫిట్‌ షో నిర్వహించకపోవడంతో తిరుపతిలోని శాంతి థియేటర్‌పై రాళ్లతో దాడికి దిగారు అభిమానులు. దీంతో థియేటర్‌ వద్ద అర్థరాత్రి గందరగోళం నెలకొంది.

  • 09 Apr 2021 06:52 AM (IST)

    పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ అదుర్స్ అంటున్న అభిమానులు

    ఫ్యాన్స్  పవన్ కళ్యాణ్ ను ఎలా చూడాలనుకుంటున్నారో అలానే చూపించాడంటూ ఆనందం వ్యక్తం చేస్తున్న అభిమానులు. పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ తో దర్శకుడు వేణు శ్రీరామ్ ఆకట్టుకున్నడంటున్న ఫ్యాన్స్

  • 09 Apr 2021 06:48 AM (IST)

    అర్ధరాత్రి నుంచి థియేటర్స్ వద్ద అభిమానుల సందడి

    అర్ధరాత్రి నుంచి థియేటర్స్ వద్ద అభిమానుల సందడి నెలకొంది. పవన్ ను వెండి తెరపైన చూడాలని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాంతో థియేటర్స్ వద్ద అభిమానుల తాకిడి ఎక్కువైంది.

Follow us on