Pawan Kalyan Ali : మళ్ళీ కలిసిన బెస్ట్ ఫ్రెండ్స్..! ఓ వివాహ వేడుకలో కలిసిన పవన్ కళ్యాణ్.. అలీ

టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ అలీ భార్య జుబేదా ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తమ కుటుంబంలోని బెస్ట్ మూమెంట్స్ అంటూ ఓ వీడియో షేర్ చేశారు జుబేదా.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది...

Pawan Kalyan Ali : మళ్ళీ కలిసిన బెస్ట్ ఫ్రెండ్స్..! ఓ వివాహ వేడుకలో కలిసిన పవన్ కళ్యాణ్.. అలీ

Updated on: Feb 21, 2021 | 2:59 PM

Pawan Kalyan Ali: టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ అలీ భార్య జుబేదా ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తమ కుటుంబంలోని బెస్ట్ మూమెంట్స్ అంటూఓ వీడియో షేర్ చేశారు జుబేదా.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఫిబ్రవరి 18 న అలీ ఇంట్లో వివాహ వేడుక జరిగింది. ఈ పెళ్ళికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఇక అలీ కూడా తన ఫ్యామిలీ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా అలీ పవన్ కళ్యాణ్ కలిసినట్లు తెలుస్తోంది. వధూవరులకు అభినందనలు తెలిపిన అనంతరం పవన్‌కల్యాణ్‌తో ఆలీ, ఆయన సతీమణి సెల్ఫీ తీసుకున్నారు. దీంతో ఈ వీడియో చూసిన సినీ ప్రేమికులు బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరూ మళ్ళీ ఒకటయ్యారు అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన తర్వాత అలీ వైసీపీ లోకి చేరడం.. ఇద్దరు మధ్య మాటల యుద్ధం.. అనంతరం స్నేహితుల మధ్య గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీలో కాకుండా అలీ అనూహ్యంగా వైసీపీ లోకి చేరడంతో అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆతర్వాత పవన్ కళ్యాణ్ అలీ పై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఇక అలీ దానికి వివరణ ఇవ్వడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఆతర్వాత కూడా అలీ వైసీపీ కే మద్దతుగా చాలా సందర్భాల్లో మాట్లాడారు. అప్పటి వరకు పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాలో ఉండే అలీ ని దూరం పెట్టారంటూ పుకార్లు షికారు అయ్యాయి.

Also Read:

ఉత్తరాకాండ్‌లోని వరదల బీభత్సంతో నీటి రంగు మార్చుకున్న అలకనందా నది.. ఫోటోలు వైరల్

ఎన్నికల హామీలను రూ. 20 బాండ్ పై రాసి నోటరీ చేయించిన అభ్యర్థి ఎక్కడంటే..!