ప్రియాంకా ! నీకు ‘ పోటీ ‘ వచ్చేస్తోందా ? నిక్ జొనాస్ తో పాక్ నటి !

| Edited By:

Sep 09, 2019 | 5:53 PM

గ్లోబల్ ఫేమస్ కపుల్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త, అమెరికన్ సింగర్ నిక్ జొనాస్ జీవితాల్లో మరో కొత్త వ్యక్తి ఎంటరయినట్టు కనిపిస్తోంది. . ఆమె ఎవరో కాదు.. పాకిస్తాన్ నటి మెహ్ విష్ హయత్.. ఇటీవలే నిక్ తో కలిసి ఈ అమ్మడు న్యూయార్క్ లో రాఫెల్ నాదల్, మెటియో బెరెటిని పోటీ పడిన మెన్స్ సెమి-ఫైనల్ చూసింది. ఈ పోటీలో రాఫెల్ ఆటతీరు చూడడానికే తాము ఎంతో ఆసక్తి చూపామని మెహ్ విష్ తెలిపింది. […]

ప్రియాంకా ! నీకు  పోటీ  వచ్చేస్తోందా ? నిక్ జొనాస్ తో పాక్ నటి !
Follow us on

గ్లోబల్ ఫేమస్ కపుల్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త, అమెరికన్ సింగర్ నిక్ జొనాస్ జీవితాల్లో మరో కొత్త వ్యక్తి ఎంటరయినట్టు కనిపిస్తోంది. . ఆమె ఎవరో కాదు.. పాకిస్తాన్ నటి మెహ్ విష్ హయత్.. ఇటీవలే నిక్ తో కలిసి ఈ అమ్మడు న్యూయార్క్ లో రాఫెల్ నాదల్, మెటియో బెరెటిని పోటీ పడిన మెన్స్ సెమి-ఫైనల్ చూసింది. ఈ పోటీలో రాఫెల్ ఆటతీరు చూడడానికే తాము ఎంతో ఆసక్తి చూపామని మెహ్ విష్ తెలిపింది. (అన్నట్టు ఈ పోటీలో మెటియో పై రాఫెల్ విజయం సాధించాడు). ఒకప్పుడు బాలాకోట్ వైమానిక దాడులను సమర్థించిన ప్రియాంక చోప్రాను మెహ్ విష్ దుయ్యబట్టింది. ‘ నీ దేశ భక్తి రేసిజంతో కూడుకున్నదని ‘ ట్వీట్ల మీద ట్వీట్లు చేసింది. కాగా- ఈ నటి అదృష్టమో (?) ఏమోగానీ ఈమె న్యూయార్క్ చేరుకున్నప్పుడు ప్రియాంక ఈ సిటీలో లేదు. తన ‘ ది స్కై ఈజ్ పింక్ ‘ మూవీని ప్రమోట్ చేసుకునేందుకు కెనడా వెళ్ళింది. నిజానికి ఎప్పుడూ నిక్, ప్రియాంక ఇద్దరూ కలిసే వెళ్లేవారు. కానీ ఎందుకో ఈ సారి ప్రియాంక ఒక్కరే వెళ్లడం ఆశ్చర్యమంటున్నారు.
ఇక’ న్యూయార్క్ లో పురుషుల సెమి ఫైనల్స్ ను ఎవరితో కలిసి నేను చూశానో గెస్ చేయండి చూద్దాం.. రాఫెల్ ఆట తీరును చూసేందుకే.. ఈ విషయంలో నేను, నిక్ ఏకీభవించాం ‘ అని మెహ్ విష్ ట్వీట్ చేస్తూ తామిద్దరూ కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది.
కాగా- ఇస్లామీకరణపై బాలీవుడ్ ద్వేషాన్ని వెలిగక్కుతోందని ఆ మధ్య ఈ పాకిస్తాన్ నటి ధ్వజమెత్తింది. పైగా షారుఖ్ ఖాన్ తన నెట్ ఫ్లిక్ మూవీలో పాక్ వ్యతిరేక పోకడలను జొప్పిస్తున్నాడని కూడా మెహ్ విష్ హయత్ ఆరోపించింది.