AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bala Krishna: మెగా కాంపౌండ్‌లోకి తొలిసారి నట సింహం ఎంట్రీ..? అసలు విషయం ఏంటంటే..

Bala Krishna: ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా.. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'అన్‌స్టాబబుల్‌ విత్‌ ఎన్‌బీకే' అనే టాక్‌షోకు సంబంధించే చర్చ జరుగుతోంది. తొలి తెలుగు ఓటీటీ ఆహా వేదికగా..

Bala Krishna: మెగా కాంపౌండ్‌లోకి తొలిసారి నట సింహం ఎంట్రీ..? అసలు విషయం ఏంటంటే..
Balakrishna
Narender Vaitla
|

Updated on: Nov 01, 2021 | 10:37 AM

Share

Bala Krishna: ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా.. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాబబుల్‌ విత్‌ ఎన్‌బీకే’ అనే టాక్‌షోకు సంబంధించే చర్చ జరుగుతోంది. తొలి తెలుగు ఓటీటీ ఆహా వేదికగా ప్రారంభంకాబోతున్న ఈ షోలో బాలయ్య మొదటి ఎపిసోడ్‌లో మంచు ఫ్యామిలీని ఇంటర్వ్యూ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పటికే సోషల్‌ మీడియాలో సందడి చేస్తుంది. తన చలాకీ తనంతో బాలయ్య బాబు వేసిన పంచ్‌లు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దీంతో ఈ షోపై ఇటు అభిమానులతో పాటు, అటు ఇండస్ట్రీలోనూ ఆసక్తినెలకొంది.

ఇదిలా ఉంటే ఈ షో ఇంకా ప్రారంభం కాకముందే మరో ఆసక్తికరమైన వార్త నెట్టింట సందడి చేస్తోంది. బాలకృష్ణ ఇంతవరకు మెగా ఫ్యామిలీకి సంబంధించి ఏ ప్రొడక్షన్‌ హౌజ్‌లోనూ నటించలేదు. ఈ లెక్కన చూస్తే ఆహా టాక్‌షోనే దీనికి బీజం వేసినట్లుగా చెప్పవచ్చు. ఆహా ఓటీటీకి అధినేతగా అల్లు అరవింద్‌ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. దీంతో బాలకృష్ణ తొలిసారి మెగా కాంపౌండ్‌లో అడుగుపెట్టినట్లు అవుతోంది. ఇదిలా ఉంటే ఓ వైపు ఈ టాక్‌షో మొదటి ఎపిసోడ్ కూడా విడుదలవకముందే మరో ఆసక్తికరమైన వార్త నెట్టింట హంగామా చేస్తోంది.

తాజాగా వైరల్‌ అవుతోన్న వార్త ప్రకారం గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో బాలకృష్ణ నటించనున్నట్లు తెలుస్తోంది. ఆహా టాక్‌షో ఒప్పందంలో సమయంలోనే బాలయ్య ఈ మేర అంగీకారం తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇక బాలకృష్ణ అన్‌స్టాబబుల్‌ తొలి ఎపిసోడ్ దీపావళి కానుకగా నవంబర్‌ 4న ప్రసారం కానుంది.

Also Read: Telangana: 106 ఏళ్ల వయసులోనూ ఎంతో హుషారు.. పొలం పనులు.. ఈ బామ్మ ఫిట్‌నెస్ నెక్ట్స్ లెవల్

Yogi Adityanath: ఎయిర్‌ స్ట్రైక్‌‌కి సిద్ధంగా ఉండండి.. తాలిబన్లకు యూపీ సీఎం వార్నింగ్..

Yogi Adityanath: ఎయిర్‌ స్ట్రైక్‌‌కి సిద్ధంగా ఉండండి.. తాలిబన్లకు యూపీ సీఎం వార్నింగ్..

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ