OTT Movies: మూవీ లవర్స్‏కు పండగే.. ఓటీటీలోకి వచ్చేసిన రెండు క్రేజీ మూవీస్.. ఎక్కడ చూడొచ్చంటే..

ఇప్పటికే మలయాళం బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ప్రేమలు సినిమా ఆహాలో అందుబాటులోకి వచ్చేసింది. అలాగే హాట్ స్టార్ లో మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదే కాకుండా అడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాత్ర 2 మూవీ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఏపీ సీఎం జగన్ జీవితం, పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన ఈమూవీ ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

OTT Movies: మూవీ లవర్స్‏కు పండగే.. ఓటీటీలోకి వచ్చేసిన రెండు క్రేజీ మూవీస్.. ఎక్కడ చూడొచ్చంటే..
Om Bhim Bush, Gaami

Updated on: Apr 12, 2024 | 8:52 AM

ఈరోజు మూవీ లవర్స్‏కు పండగే.. ఒకేరోజు డిజిటల్ ప్లాట్ ఫామ్‏లోకి బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి. గత కొన్నాళ్లుగా అటు థియేటర్లు, ఇటు ఓటీటీల్లో మెప్పించే సినిమాలు లేవు. అలాగే ఆసక్తి కలిగించే వెబ్ సిరీస్‏లు కూడా లేవు. చాలా రోజులుగా ఓటీటీలో ఒకటి రెండు సినిమాలు మాత్రమే ప్రేక్షకులను అలరించాయి. కానీ ఈరోజు మాత్రం ఏకంగా నాలుగైదు చిత్రాలు సినీ ప్రియుల ముందుకు వచ్చాయి. ఇప్పటికే మలయాళం బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ప్రేమలు సినిమా ఆహాలో అందుబాటులోకి వచ్చేసింది. అలాగే హాట్ స్టార్ లో మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదే కాకుండా అడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాత్ర 2 మూవీ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఏపీ సీఎం జగన్ జీవితం, పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన ఈమూవీ ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇక ఇప్పుడు మరో రెండు క్రేజీ మూవీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. గతనెలలో శివరాత్రి కానుకగా అడియన్స్ ముందుకు వచ్చిన సినిమా గామి. ఇందులో విశ్వక్ సేన్, చాందిని చౌదరి జంటగా నటించారు. దాదాపు ఆరేళ్లపాటు ఈ మూవీ షూటింగ్ జరగ్గా మొదటి రోజే సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఇందులో అఘోర పాత్రలో కనిపించారు విశ్వక్ సేన్. ఇక ఇప్పుడు ఈ మూవీలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లోకి అందుబాటులోకి వచ్చేసింది. తెలుగు, తమిళం, కన్నడ వెర్షన్స్ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

అలాగే ఈ ఏడాది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సినిమాల్లో ఓం భీమ్ బుష్. శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలలో నటించిన సినిమా ఇది. లాజిక్స్ లేని కామెడీతో అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించిన ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం ప్రేమలు, యాత్ర 2, గామి, ఓం భీమ్ బుష్ మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.