రాబోయే వారంలో కొత్త సినిమాల స్ట్రీమింగ్‌తో ఓటీటీలు కళకళలాడనున్నాయి. ఈ లిస్టులో భారీ సినిమాలు ఉండడంతో, ఓటీటీ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఈ సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. బిగ్ స్క్రీన్‌పై సందడి చేసిన విశ్వనాయకుడు కమల్ నటించిన విక్రమ్ సినిమా జులై 8న ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. దీంతో మొదలైన ఓటీటీ సందడి.. వరుస సినిమాలతో వీక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు ఓటీటీ సంస్థలు కూడా సిద్ధమయ్యాయి. విక్రమ్ సినిమా హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇది తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. కమల్ కంబ్యాక్ సినిమా దాదాపు రూ. 400 కోట్లు వసూళ్లు చేసి, మంచి పేరు తెచ్చుకుంది. థియేటర్లో విడుదలైన 35 రోజుల్లోనే ఓటీటీ బాట పట్టనుంది.
నాచురల్ స్టాన్ నాని హీరోగా విడుదలై ‘అంటే సుందరానికి’ సినిమా జులై 10 న నెట్ ఫ్లిక్స్‌లో సందడి చేసేందుకు సిద్ధమైంది. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ లీడ్ రోల్స్ పోషించిన ఎఫ్3 సినిమా.. జులై 3వ వారంలో సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు హైదరాబాద్ నేపథ్యంలో తీసిన ‘మోడర్న్ లవ్’ వెబ్ సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్ రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. ఇందులో 6 కథలను చూపించనున్నారు. ఆదిపిని శెట్టి, రీతువర్మ, నిత్యామీనన్, రేవతి, సుహాసిని, నరేష్, మాళవిక నాయర్ కీలక పాత్రల్లో నటించారు. జులై 8 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అమెజాన్ ప్రకటించింది.