మార్కెట్లోకి మరో కొత్త తెలుగు ఓటీటీ.. సినిమా నిర్మాణానికి అవసరమైన సాంకేతిక సహకారం అందించడం దీని ప్రత్యేకత.

|

Dec 17, 2020 | 5:31 PM

కరోనా పుణ్యామాని ఓటీటీలకు ప్రాముఖ్యత పెరుగుతోంది. ఇంటర్‌నెట్ వినియోగం పెరగడం, థియేటర్లు మూతపడడంతో ప్రేక్షకులు ఓటీటీల బాట పడుతున్నారు. దీంతో రోజుకో కొత్త ఓటీటీ సంస్థ పుట్టుకొస్తోంది. అమేజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి అంతర్జాతీయ సంస్థలే కాకుండా తెలుగులోనూ కొన్ని ఓటీటీలు అందుబాటులోకి వస్తున్నాయి.

మార్కెట్లోకి మరో కొత్త తెలుగు ఓటీటీ.. సినిమా నిర్మాణానికి అవసరమైన సాంకేతిక సహకారం అందించడం దీని ప్రత్యేకత.
Follow us on

New ott urvashi launches: కరోనా పుణ్యామాని ఓటీటీలకు ప్రాముఖ్యత పెరుగుతోంది. ఇంటర్‌నెట్ వినియోగం పెరగడం, థియేటర్లు మూతపడడంతో ప్రేక్షకులు ఓటీటీల బాట పడుతున్నారు. దీంతో రోజుకో కొత్త ఓటీటీ సంస్థ పుట్టుకొస్తోంది. అమేజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి అంతర్జాతీయ సంస్థలే కాకుండా తెలుగులోనూ కొన్ని ఓటీటీలు అందుబాటులోకి వస్తున్నాయి. ‘ఆహా’ ఇదే కోవలోకి వస్తుంది. అయితే తాజాగా తెలుగులో మరో ఓటీటీ సంస్థ తమ సేవలను ప్రారంభించింది. ఈ సరికొత్త స్ట్రీమింగ్ యాప్ పేరు ‘ఊర్వశి’. గురువారం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఉన్న తమ ఆఫీసులో ‘ఊర్వశి ఓటీటీ’ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ హాజరై ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. విభిన్నమైన సినిమాలు, వినూత్నమైన షోలతో ఊర్వశి ఓటీటీ అందరినీ ఆకట్టుకోవాలని కోరుకున్నారు. ఇక ఈ ఓటీటీ ప్రత్యేకత విషయానికొస్తే.. సినిమా నిర్మాణానికి అవసరమైన పూర్తి స్థాయి సాంకేతిక సహకారంతో పాటు, విడుదలకు అవసరమైన సాయాన్ని అందిస్తారు. ఊర్వశి ఓటీటీ డైరెక్టర్స్ ఎం.ఎస్.రెడ్డి, రవి మాట్లాడుతూ.. తమ ఓటీటీ కార్యాలయం విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా మొదలు కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ నెలాఖరకు వరకు ‘ఇనాగురల్ ఆఫర్’గా ‘ఊర్వశి ఓటీటీ’ని ఉచితంగా చూసే అవకాశాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో ‘దండుపాళ్యం’ ఫేమ్ శ్రీనివాస్ రాజు, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.