AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saindhav OTT: ఆ ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతున్న వెంకటేశ్ సూపర్ హిట్ .. ‘సైంధవ్’ సినిమాను ఎక్కడ చూడొచ్చంటే..

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ సృష్టించాయి. అయితే ఇప్పుడు ఇవే సినిమాలు ఓటీటీలో అలరించేందుకు రెడీ అయ్యాయి. అందులో ఓ సినిమా ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసింది. అదే సైంధవ్. విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన సినిమా ఇది. ఇందులో రుహానీ శర్మ, ఆండ్రియా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, శ్రద్ధా శ్రీనాథ్ కీలకపాత్రలు పోషించారు. తన కూతురి ప్రాణం కాపాడడం కోసం ఓ తండ్రి చేసే పోరాటమే సైంధవ్. జనవరి 12న విడుదలైన ఈ మూవీ మంచి రెస్పాన్స్ అందుకుంది.

Saindhav OTT: ఆ ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతున్న వెంకటేశ్ సూపర్ హిట్ .. 'సైంధవ్' సినిమాను ఎక్కడ చూడొచ్చంటే..
Saindhav Movie
Rajitha Chanti
|

Updated on: Feb 03, 2024 | 11:25 AM

Share

ఈ ఏడాది సంక్రాంతి బరిలో ఏకంగా నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగ రిలీజ్ అయి సూపర్ హిట్‏గా నిలిచాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ సృష్టించాయి. అయితే ఇప్పుడు ఇవే సినిమాలు ఓటీటీలో అలరించేందుకు రెడీ అయ్యాయి. అందులో ఓ సినిమా ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసింది. అదే సైంధవ్. విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన సినిమా ఇది. ఇందులో రుహానీ శర్మ, ఆండ్రియా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, శ్రద్ధా శ్రీనాథ్ కీలకపాత్రలు పోషించారు. తన కూతురి ప్రాణం కాపాడడం కోసం ఓ తండ్రి చేసే పోరాటమే సైంధవ్. జనవరి 12న విడుదలైన ఈ మూవీ మంచి రెస్పాన్స్ అందుకుంది. కానీ కమర్షియల్ గా అంత సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. గత అర్దరాత్రి నుంచి ఈ మూవీ ప్రసారం అవుతుంది. అయితే ఇన్నాళ్లు థియేటర్లలో మిస్ అయినవారు ఇప్పుడు నేరుగా ఓటీటీలో చూసేయ్యొచ్చు.

కథ విషయానికి వస్తే.. చంద్రప్రస్థ అనే కల్పితన నగరం నేపథ్యంలో ఈ మూవీ సాగుతుంది. ఇందులో సైంధవ్ కోనేరు.. అలియాస్ సైకో (వెంకటేష్) తన ఫ్యామిలీతో కలిసి నివసిస్తుంటాడు. భర్త నుంచి విడిపోయిన మనో (శ్రద్ధా శ్రీనాథ్)తో అతడికి పరిచయం ఏర్పడుతుంది. గతంలో కార్టెల్ సంస్థలో పనిచేసిన సైంధవ్.. తన భార్యకు ఇచ్చిన మాట కోసం అక్కడ పనిచేయడం మానేస్తాడు. అయితే తన కూతురే ప్రపంచంగా బతుకుతుంటాడు సైంధవ్. అదే సమయంలో తన కూతురు అరుదైన జబ్బుతో బాధపడుతుంటుంది. ఆ పాపకు జబ్బు తగ్గాలంటే రూ. 17 కోట్ల ఇంజక్షన్ కావాలి. అయితే తన బిడ్డ లాగే మరికొందరు చిన్నారు కూడా ఇదే సమస్యతో బాధపడుతుంటారని తెలుసుకుంటాడు. అదే సమయంలో కొంతమంది టెర్రరిస్టుల ముఠా సైంధవ్ ను చూసి భయపడుతుంది. వారితో సైంధవ్ కు సంబంధం ఏంటీ ? చివరకు తన కూతురిని ఎలా కాపాడుకున్నాడు ? అనేది సినిమా.

చాలా కాలం తర్వాత ఈ సినిమాతో మాస్ యాక్షన్ హీరోగా కనిపించాడు వెంకీ. అయితే ఇన్నాళ్లు ఫ్యామిలీ స్టార్, కామెడీ కింగ్ గా చూసిన అడియన్స్ సైంధవ్ అంతగా క్లిక్ అవ్వలేదు. దాదాపు రూ. 50 కోట్ల బడ్జెట్ తో నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. సంతోష్ నారయణ్ సంగీతం అందించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్