Sankranthiki Vasthunam OTT: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఓటీటీ అనౌన్స్‌మెంట్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

విక్టరీ వెంకటేశ్‌ హీరోగా నటించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి వెంకీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

Sankranthiki Vasthunam OTT: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఓటీటీ అనౌన్స్‌మెంట్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Sankranthiki Vasthunam Movie

Updated on: Feb 21, 2025 | 11:33 AM

ఎఫ్ 2,ఎఫ్ 3 వంటి సూపర్ హిట్స్ తర్వాత విక్టరీ వెంకటేశ్‌, అనిల్‌ రావిపూడి కాంబినేషన్ లో తెరెకెక్కిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్‌, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. వెంకటేశ్, ఐశ్వర్య, మీనాక్షిల నటనతో పాటు బుల్లిరాజు కామెడీ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. దీంతో సంక్రాంతికి వస్తున్నాం సినిమా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక ఓవర్సీస్ లోనూ భారీ కలెక్షన్లు వచ్చాయి. ఇదిలా ఉంటే థియేటర్లలో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తోన్న సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ సినిమా డిజిటల్ అండ్ శాటి లైట్ రైట్స్ ను జీ5 సంస్థ సొంతం చేసుకుంది. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమాను సినిమాను ఓటీటీలో కంటే ముందుగా టీవీలో టెలికాస్ట్ చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అప్పుడే జీ తెలుగు కూడా సినిమా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ‘త్వరలోనే సంక్రాంతికి వస్తున్నాం సినిమా టీవీలోకి వస్తోంది’ అంటూ వీడియోలు కూడా రిలీజ్ చేసింది. ఇదిలావుంటే టీవీ కంటే ముందుగానే ఈ మూవీ ఓటీటీ అనౌన్స్‌మెంట్‌ వచ్చింది.

తాజాగా జీ 5 సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర మైన పోస్టును షేర్ చేసింది. ‘ఏమండోయ్‌.. వాళ్లు వస్తున్నారు. మరిన్ని వివరాలు, కూసంత చమత్కారం కోసం వేచి చూడండి. త్వరలోనే మరిన్ని వివరాలను ప్రకటిస్తాం’ అంటూ జీ5 రాసుకోచ్చింది. దీనికి ‘సంక్రాంతికి వ‌స్తున్నాం క‌మింగ్ సూన్’ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను కూడా జోడించింది. దీంతో త్వ‌ర‌లోనే ఓటీటీ డేట్‌ని ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. మరి టీవీలో ముందు వస్తుందో లేదా ఓటీటీలో ముందు వస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

జీ5 లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.