Ustaad Movie: 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన ఉస్తాద్.. కీరవాణి తనయుడి సినిమా స్ట్రీమింగ్ ఎక్కడంటే..

|

Sep 01, 2023 | 10:50 PM

ఇప్పటికే ఇలా చాలా సినిమాలు ఓటీటీలో తక్కువ రోజుల్లోనే ఓటీటీల్లోకి వచ్చాయి. ఇప్పుడు ఇదే క్రమంలో లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఓ మూవీ కేవలం 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసింది. ఆ సినిమా మరేదో కాదు సింహ నటించిన ఉస్తాద్. ఈ సినిమా ఆగ‌స్ట్ 12న థియేట‌ర్ల‌లో విడుదలైంది. శ్రీ సింహ హీరోగా నటించిన  ఈ సినిమాలు ఫణి దర్శకత్వం వహించారు.

Ustaad Movie: 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన ఉస్తాద్.. కీరవాణి తనయుడి సినిమా స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Ustaad Movie
Follow us on

ఈ మధ్య కాలంలో ఓటీటీల హంగామా ఎక్కువైపోయింది. థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. అయితే సినిమా రిలీజ్ అయినా నెలకో లేక 100 రోజుల తర్వాత సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవవడం అనేది కామన్.. కానీ కొన్ని సినిమాలు మరీ వారం రోజులకు పది రోజులకు ఓటీటీల్లోకి వచేస్తున్నాయి. ఇప్పటికే ఇలా చాలా సినిమాలు ఓటీటీలో తక్కువ రోజుల్లోనే ఓటీటీల్లోకి వచ్చాయి. ఇప్పుడు ఇదే క్రమంలో లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఓ మూవీ కేవలం 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసింది. ఆ సినిమా మరేదో కాదు సింహ నటించిన ఉస్తాద్. ఈ సినిమా ఆగ‌స్ట్ 12న థియేట‌ర్ల‌లో విడుదలైంది. శ్రీ సింహ హీరోగా నటించిన  ఈ సినిమాలు ఫణి దర్శకత్వం వహించారు. కాన్సెప్ట్ కొత్త‌గా ఉన్నా కూడా ఈ సినిమా ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపలేకపోయింది. విడుదలకు ముందు ఈ మూవీ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. పైగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని, రాజమౌళి సందడి చేసి సినిమా పై హైప్ పెంచేశారు.

అయినా కూడా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈ మూవీ ఫ్లాప్ టాక్ ను మూటకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఉస్తాద్ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఎలాంటి అప్డేట్ లేకుండా ఈ మూవీని డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేశారు.

సినిమా రిలీజ్ అయ్యి 20 రోజులకు కూడా పూర్తికాక ముందే ఇలా ఓటీటీలోకి వచ్చేసింది ఉస్తాద్. థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయిన ఉస్తాద్ సినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాలో సింహకు జోడీగా బలగం సినిమా ఫేమ్ కావ్య కళ్యాణ్ రామ్ నటించింది. అలాగే ప్రముఖ దర్శకుడు గౌత‌మ్ మీన‌న్‌, అదేవిధంగా టాలీవుడ్ దర్శకుడు వెంక‌టేష్ మ‌హా కీల‌క పాత్ర‌ల్లో నటించి మెప్పించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.