OTT Movie: ఆ హైవేలో వెళితే చావే.. తమిళనాడులో జరిగిన రియల్ స్టోరీ.. ఓటీటీలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?

తమిళనాడులోని ఓ జాతీయ రహదారిపై జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఆసక్తికరమైన కథా కథనాలు, ఊహించని ట్విస్టులతో సాగే ఈ సినిమా ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించింది. ఓటీటీలో మంచి ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకునేవారికి ఇది మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

OTT Movie: ఆ హైవేలో వెళితే చావే.. తమిళనాడులో జరిగిన రియల్ స్టోరీ.. ఓటీటీలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
The Road Movie

Updated on: Nov 26, 2025 | 8:15 PM

ఈ మధ్యన నిజ జీవిత సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల ఆధారంగా సినిమాలు, సిరీస్ లు తెరకెక్కుతున్నాయి. వీటికి ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఓటీటీలో ఈ రియాల్ స్టోరీలకు మూవీ లవర్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక రియల్ క్రైమ్ స్టోరీనే. తమిళనాడులోని ఓ జాతీయ రహదారిపై జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. జాతీయ హైవేలోని ఒక‌ ప్రదేశంలో వరుసగా హత్యలు జరుగుతాయి. అసలు ఈ హత్యల వెనక మర్మమేమిటి? దాని వెనక ఉన్నది ఎవరు అనేది తెలుసుకోవడానికి పోలీసులు తెగ ప్రయత్నిస్తున్నారు. కానీ ఒక్క క్లూ కూడా దొరకదు. ఇదే క్రమంలో హీరోయిన్ కుటుంబ సభ్యులు కూడా ఈ హైవేలో ప్రాణాలు కోల్పోతారు. దీంతో ఆమె ఆ హైవేలో ఉన్న మిస్టరీని తెలుసుకునేందుకు హీరోయిన్ నడుం బిగిస్తుంది. ఈ క్రమంలో ఆమెకు విపత్కర పరిస్థితులు ఎదురవుతాయి?  తన  కుటుంబీకులు చనిపోవడానికి అనుకోని ప్రమాదం కారణం కాదనీ, పక్కాగా ప్లాన్ చేయడం వలన జరిగిందనే సందేహం హీరోయిన్ కు కలుగుతుంది. దీంతో ఎలాగైనా వారిని పట్టుకోవాలని నడుం బిగిస్తుంది. మరి అసలు ఆ నేషనల్ హైవేలో జరుగుతున్న వరుస హత్యలకు కారణమెవరు? అసలు వారెందుకీ హత్యలకు పాల్పడుతున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఉత్కంఠభరితమైన సీన్లు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగే ఈ సినిమా పేరు ది రోడ్. రివెంజ్ ఇన్ 462 కిలోమీటర్స్ అనేది ఈ మూవీ క్యాప్షన్‌ . అరుణ్ వశీగరన్ తెరకెక్కించిన ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో సౌతిండియన్ బ్యూటీ క్వీన త్రిష హీరోయిన్ గా నటించింది. మాలీవుడ్‌ నటుడు షబీర్ కీ రోల్‌ పోషించాడు. ఇక త్రిష స్నేహితురాలిగా మియా జార్జ్, కానిస్టేబుల్ పాత్రలో భాస్కర్ ప్రాధాన్యమున్న పాత్రల్లో మెప్పించారు. ఏఏఏ సినిమా బ్యానర్‌పై తెరకెక్కిన‌ ఈ చిత్రానికి శ్యామ్‌ సీఎస్‌ సంగీతం అందించాడు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగే ఈ సినిమా మూవీ లవర్స్ కు ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

ఆహాలో చూడొచ్చు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి