OTT Movie: చిన్న క్లూ కూడా దొరక్కుండా బాస్‌ను లేపేసే ఉద్యోగులు.. ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను చూస్తే మైండ్ బ్లాక్ ఖాయం

ప్రస్తుతం ఓటీటీలో మలయాళ సినిమాల హవా నడుస్తోంది. ముఖ్యంగా హారర్, క్రైమ్, థ్రిల్లర్, సస్పెన్స్ జానర్ సినిమాలను అన్ని భాషల వారు ఆదరిస్తున్నారు.ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ లో కూడా ఓ రేంజ్ లో ట్విస్టులు ఉన్నాయి. తెలుగులోనూ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

OTT Movie: చిన్న క్లూ కూడా దొరక్కుండా బాస్‌ను లేపేసే ఉద్యోగులు.. ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను చూస్తే మైండ్ బ్లాక్ ఖాయం
OTT Movie

Edited By: Ravi Kiran

Updated on: Jun 30, 2025 | 1:43 PM

క్రైమ్ థ్రిల్లర్, మర్డర్ ఇన్వెస్టిగేషన్ సినిమాలు ఎంతో ఆసక్తికరంగా సాగుతుంటాయి. అనుమానాస్పద రీతిలో హత్య జరగడం, అనుమానితుల గురించి పోలీసులు వెతకడం, ఆ హత్య వెనక కారణాలు.. ఇలా ఈ అంశాల చుట్టూనే సినిమాలు సాగుతుంటాయి. ఈ సినిమా కథ కూడా సరిగ్గా ఇలాగే సాగుతుంది. ఇందులో వీ టెక్ కంపెనీ అధినేతగా ఇసాక్ అనే వ్యక్తి ఉంటాడు. ఒక్కరోజు అతను ఊహించని విధంగా అనుమానాస్పద రీతిలో శవమై కనిపిస్తాడు. అది కూడా వాష్ రూమ్ లో. పైగా డెడ్ బాడీ ఉన్న గదికి లోపల నుంచే లాక్ వేసి ఉంటుంది. దీంతో కేసును పరిశీలించిన పోలీసులు ప్రమాదవశాత్తు అతను కింద పడి తలకు గాయమై చనిపోయాడేమోనని భావిస్తారు. అదే సమయంలో మరో సీనియర్ పోలీసాఫీసర్ ఏఎస్‌పీ సందీప్‌ చేతికి ఈ కేసును అప్పగిస్తారు. అతనికి ఇది అసలు ప్రమాదమే కాదు, హత్య అనే అనుమానం వస్తుంది. దీంతో తనదైన శైలిలో విచారణ మొదలు పెడతాడు సందీప్. ఈ నేపథ్యంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తాయి. ముందుగా ఆఫీస్‌లో ప‌నిచేస్తోన్న ప‌ద‌మూడు మందిపై అనుమానంతో వారిని ఇంట‌రాగేట్ చేస్తాడు. అదే సమయంలో ఆఫీస్ ఉద్యోగులందరితో ఒక సైక‌లాజిస్ట్ తో సంబంధం ఉంద‌ని తేలుతుంది. దీంతో సందీప్
కురియాకోస్ ను కలిసి ద్వారా ఆ ప‌ద‌మూడు మంది గురించి తెలుసుకుంటాడు. ఇదే సమయంలో సందీప్‌కు విస్తుపోయే నిజాలు తెలుస్తాయి. అవేమిటి?

మరి ఇసాక్ ను హత్య చేశారా? అతన్ని చంపింది ఎవరు? ఆఫీస్ ఉద్యోగుల పాత్ర ఏమిటి? చివరికి ఏం జరిగింది? అనే విషయాలు తెలియాలంటే ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూడాల్సిందే. ఈ సినిమా పేరు గోళం.. గతేడాది థియేటర్లతో పాటు ఓటీటీలోనూ సంచలనం సృష్టించిందీ సినిమా. స్టార్టింగ్ నుంచి ఎండ్ వ‌ర‌కు నెక్స్ట్ ఏం జ‌రుగుతుందోనని ఆద్యంతం క్యూరియాసిటీని క‌లిగించేలా ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఒక్కో చిక్కుముడిని విప్పుతూ చివ‌ర‌కు జాన్‌ను ఎవ‌రు హ‌త్య చేశాడ‌న్న‌ది చూపించే సీన్ మాత్రం నెక్ట్స్ లెవెల్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

గోళం సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూడాలనుకునేవారికి ఇది ఒక మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .