OTT Movie: కడుపుబ్బా నవ్వుకోండిక.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా.. IMDBలో 7.8 రేటింగ్

కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. మంచి రూరల్ కామెడీ డ్రామాతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించింది. వసూళ్లు కూడా బాగానే వచ్చాయి. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. గురువారం (మే 07) అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతోంది.

OTT Movie: కడుపుబ్బా నవ్వుకోండిక.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా.. IMDBలో 7.8 రేటింగ్
OTT Movie

Updated on: May 07, 2026 | 1:04 PM

ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు కొత్త సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం తదితర భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఇప్పటికే ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఎల్ఐకే) సినిమా స్ట్రీమింగ్ కు రాగా గురువారం (మే 07) అర్ధరాత్రి నుంచి మరో కొత్త సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇదొక తెలుగు సినిమా. రూరల్ కామెడీ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కింది. ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లనే రాబట్టింది. ఓ సున్నితమైన అంశాన్ని ఎలాంటి బూతులు, అసభ్యకరతకు తావివ్వకుండా ఈ సినిమాను తెరకెక్కించారు మేకర్స్. ఐఎమ్ డీబీలో ఈ సినిమాకు ఏకంగా 7.8 రేటింగ్ ఉండడం విశేషం. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇందులో హీరో, హీరోయిన్లు చిన్నప్పటి నుంచి ప్రేమించకుఉంటారు. పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకుంటారు. అయితే శోభనం అయిన వెంటనే భార్య ఊరి పెద్దలతో పంచాయతీ పెట్టిస్తుంది. తన భర్త తనను ఇబ్బంది పెడుతున్నాడని చెబుతుంది. కానీ అసలు సమస్య మాత్రం చెప్పదు. దీంతో హీరోపై ఊరందరిలో అనుమానం మొదలవుతుంది.
మరి తర్వాత ఏమైంది? అసలు హీరోకు ఉన్న సమస్య ఏంటి? హీరోయిన్ ను ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు? చివరకు వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

మసూద హీరో తిరువీర్ నటించిన ఈ సినిమా పేరు పాపం ప్రతాప్. ఎస్పీ దుర్గా నరేష్ తెరకెక్కించిన ఈ రూరల్ కామెడీ మూవీలో తిరువీర్ సరసన పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌గా నటించింది. సీనియర్ నటుడు అజయ్ ఘోష్, సీనియర్ హీరోయిన్ రాశి, గోపరాజు రమణ, శ్రీనివాస్ అవసరాల, దేవీ ప్రసాద్, రవి ఆంథోని, రఘు బాబు, రూపా లక్ష్మి, ప్రసాద్ బెహరా, అనంత్ బాబు తదితరులు ఈ మూవీలో కీలక పాత్ర లు పోషించారు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఇప్పుడు ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. క్రిషి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్, ఈటీవీ విన్ సంయుక్తంగా పాపం ప్రతాప్ సినిమాను నిర్మించారు. కె.ఎం. రాధాకృష్ణన్ ఈ సినిమాకు సంగీతం అందించడం విశేషం. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? అయితే టైమ్ పాస్ కోసం ఒక లుక్కేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఈటీవీ విన్ లో పాపం ప్రతాప్ సినిమా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us