గతవారం థియేటర్లలో దాదాపు అన్ని చిన్న సినిమాలే రిలీజ్ అయ్యాయి. అందులో కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమా సూపర్ హిట్ అయ్యింది. ట్రైలర్, టీజర్ తోనే ఆసక్తిని పెంచేసిన ఈ మూవీ మంచి వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ వారం శుక్రవారం వచ్చేసింది. ఎప్పటిలాగే అటు థియేటర్లలో.. ఇటు ఓటీటీలలో పలు సినిమాలు, వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయి. కానీ ఈ వారం మాత్రం పెద్ద సినిమాలు సందడి చేయనున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సూపర్ హిట్ మూవీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే వెంకీ నటించిన సైంధవ్ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు గుంటూరు కారం, అయలాన్, కెప్టెన్ మిల్లర్ చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఇవే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ భాషల్లో పలు చిత్రాలు విడుదల కాబోతున్నాయి. అవెంటో తెలుసుకుందామా.
మాస్ మహారాజా రవితేజ నటించిన లేటేస్ట్ సినిమా ఈగల్. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ థియేటర్లలో ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. నవదీప్, అవసరాల శ్రీనివాస్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
అలాగే ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించిన సినిమా లాల్ సలామ్. విష్ణు విశాల్ నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో సూపర్ స్టార్ రజినీకాంత్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. తెలుగులోనూ ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది. అలాగే డైరెక్టర్ మహి వి రాఘవ తెరకెక్కించిన యాత్ర 2 ఈరోజు అడియన్స్ ముందుకు వచ్చేసింది. ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు ఏంటో తెలుసుకుందమా.
నెట్ ఫ్లిక్స్..
అమెజాన్ ప్రైమ్..
జీ5..
జియో సినిమా..
సన్ నెక్ట్స్..
డిస్నీప్లస్ హాట్ స్టార్..