
ప్రస్తుతం ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లదే హవా. అందులోనూ నిజ జీవిత సంఘటలన ఆధారంగా తెరకెక్కిన సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఓటీటీలో బాగా ఆదరణ లభిస్తోంది. అందుకే ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలను కూడా తెలుగు అనువాదం చేసి మరీ ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. అలా గత వారం ఓటీటీకి వచ్చిన ఓ తెలుగు సినిమా ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతోంది. గర్భిణీలను మాత్రమే టార్గెట్ చేసి దారుణంగా చంపే సైకో కిల్లర్ చుట్టూ తిరిగే ఈ సినిమాకు ఐఎమ్ డీబీలోనూ పదికి 8 రేటింగ్ దక్కడం విశేషం. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆడలేదు. స్టార్ క్యాస్టింగ్ లేకపోవడం, పెద్దగా ప్రమోషన్లు చేయకపోవడం ఈ సినిమాకు మైనస్ గా మారింది. అయితే ఇప్పుడీ సినిమా సడెన్ గా స్ట్రీమింగ్ కు వచ్చింది. థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపని ఈ క్రైమ్ థ్రిల్లర్ డిజిటల్ స్ట్రీమింగ్ లో మాత్రం టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. స్టోరీ విషయానికి వస్తే.. నగరంలో వరుసగా గర్భిణులు హత్యకు గురవుతారు. వీటి వెనక ఒక సైకో కిల్లర్ ఉన్నాడని పోలీసులు గ్రహిస్తారు. కానీ ఎంత ప్రయత్నించినా ఆ క్రిమినల్ జాడ తెలుసుకోలేకపోతారు. దీంతో ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ఈ కేసును టేకప్ చేస్తాడు. ఈ క్రమంలో ఆ డిటెక్టివ్ కు సంచలన విషయాలు తెలుస్తాయి. మరి అసలు ఆ సైకో కిల్లర్ ఎవరు? కేవలం గర్భిణీలనే ఎందుకు చంపుతున్నాడు? ఈ ఘోరాల వెనుక ఉన్న అతని ఉద్దేశమేంటి? పోలీసులు ఆ సైకోను ఎలా పట్టుకున్నారన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ సినిమా పేరు Cమంతం (Cmantham). దర్శకుడు సుధాకర్ పాని తెరకెక్కించిన ఈ సినిమాలో వజ్రయోగి, శ్రేయ భారతి ప్రధాన పాత్రల్లో నటించారు. థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపని ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో మాత్రం ఆకట్టుకంటోంది. ఈ సిఇనమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకోగా, రెండు రోజుల క్రితమే ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చింది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది.ప్రస్తుతం ఈ సినిమా కేవలం రెంటల్ విధానంలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. మరికొన్ని రోజుల్లో ఫ్రీగా చూసే అవకాశం లభించవచ్చు. మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూడాలనుకునేవారికి సీమంతం ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.