OTT Movie: ఆ 23 మంది చావుకు కారణమెవరు? ఏపీలో సంచలనం సృష్టించిన సంఘటనపై తెరకెక్కిన రియల్ స్టోరీ.. మిస్ కావొద్దు

నిజ జీవితంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సున్నితమైన ప్రేమకథకు క్రైమ్ ఎలిమెంట్స్ ను జోడించి ఈ సినిమాను రూపొందించారు. ఇటీవల థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేసింది.

OTT Movie: ఆ 23 మంది చావుకు కారణమెవరు? ఏపీలో సంచలనం సృష్టించిన సంఘటనపై తెరకెక్కిన రియల్ స్టోరీ.. మిస్ కావొద్దు
OTT Movie

Updated on: Jun 27, 2025 | 6:31 PM

ఎప్పటిలాగే ఈ శుక్రవారం (జూన్ 27) పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు ఓటీటీ ఆడియెన్స్ కు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ఒక ఆసక్తికరమైన తెలుగు సినిమా కూడా ఉంది. నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటలన ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. పాజిటివ్ రివ్యూలతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి. అయితే పేరున్న నటీనటులు లేకపోవడంతో లాంగ్ రన్ ఆడలేకపోయింది. అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. 1993 నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఒకే గ్రామానికి చెందిన సాగర్‌, సుశీల ఇద్దరూ ప్రేమించుకుంటారు. సాగర్‌కు దాస్ అనే మరో స్నేహితుడు కూడా ఉంటాడు. దళితులు కావడంతో బాగా అప్పట్లో బాగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాంటి సమయంలో ఏం చేయాలో తెలియక ఓసారి బస్సు దోపిడీ చేయాలనుకుంటారు. దానికోసం బెదిరించడానికి వెంట తెచ్చుకున్న పెట్రోల్ బస్సులో పోస్తారు. అయితే ప్రయాణికులు గగ్గోలు పెట్టడంతో కంగారులో బస్సుకు నిప్పంటిస్తాడు సాగర్. అంతే 23 మంది అక్కడికక్కడే సజీవ దహనం అయిపోతారు. అందులో చిన్న పిల్లలు కూడా ఉంటారు. దీంతో న్యాయ స్థానం వారికి ఉరి శిక్ష వేస్తుంది. అయితే ఈ ఘటన జరిగిన నాలుగేళ్లకు జూబ్లీ హిల్స్ బాంబు బ్లాస్టులో 28 మంది అమాయకులు చనిపోతారు. మరి ఈ పేలుడుకు కారణమైన వారికి కోర్టు ఏం తీర్పు ఇచ్చింది. వారికి కూడా ఉరిశిక్ష విధించిందా లేదా అనేదే ఈ సినిమా కథ.

దీనిని చదివిన చాలా మందికి ఈపాటికే అర్థమై ఉంటుంది మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామో? 1993లో ఏపీలో సంచలనం సృష్టించిన చిలకలూరి పేట బస్సు దహనం, అంతకు ముందు చుండూరు మారణకాండ, అలాగే 1997 జూబ్లీ హిల్స్ బాంబు బ్లాస్టుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. మల్లేశం, 8 AM మెట్రో సినిమాలతో ట్యాలెంటెడ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజ్ రాచకొండ ఈ 23 (ఇరవై మూడు) సినిమాను తెరకెక్కించాడు. తేజ, తన్మయా, వేద వ్యాస్, ఝాన్సీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
గత నెలలో థియేటర్లలో రిలీజై మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .