Ranam Aram Thavarel: మిస్టరీ థ్రిల్లర్ చిత్రాలు చూడాలంటే ఇష్టమా..?.. ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..

|

Apr 20, 2024 | 11:49 AM

ఫిబ్రవరి 23న విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఒక నర్సు అనుమానస్పద మరణం చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. ఈ ఏడాది విడుదలైన అద్భుతమైన థ్రిల్లర్‌ చిత్రాలలో ఈ మూవీ ఒకటి అంటూ సినీ క్రిటిక్స్ ప్రశంసలు కురిపించారు. ఆకట్టుకునే కథాంశం, నటీనటుల అద్భుతమైన నటనతో సినీ ప్రియులను మరింత అలరించింది. ఈ చిత్రానికి అన్ని వర్గాల అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Ranam Aram Thavarel: మిస్టరీ థ్రిల్లర్ చిత్రాలు చూడాలంటే ఇష్టమా..?.. ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
Ranam Aram Thavarel
Follow us on

ఇటీవల తమిల్, మలయాళం సినిమాలు సూపర్ హిట్స్ అవుతున్న సంగతి తెలిసిందే. కామెడీ, రొమాంటిక్ చిత్రాలే కాకుండా హారర్, సస్పెన్స్ థ్రిల్లింగ్ మూవీస్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా మరో మిస్టరీ థ్రిలర్ తమిళ్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. కోలీవుడ్ డైరెక్టర్ షెరీఫ్ దర్శకత్వం వహించిన సినిమా ‘రణం – అరమ్ తవరెల్’. ఇందులో వైభవ్ రెడ్డి, నందితా శ్వేత, తాన్య హోప్, సరస్వతి మీనన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 23న విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఒక నర్సు అనుమానస్పద మరణం చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. ఈ ఏడాది విడుదలైన అద్భుతమైన థ్రిల్లర్‌ చిత్రాలలో ఈ మూవీ ఒకటి అంటూ సినీ క్రిటిక్స్ ప్రశంసలు కురిపించారు. ఆకట్టుకునే కథాంశం, నటీనటుల అద్భుతమైన నటనతో సినీ ప్రియులను మరింత అలరించింది. ఈ చిత్రానికి అన్ని వర్గాల అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇన్నాళ్లు థియేటర్లలో సందడి చేసిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈసినిమా గత అర్దరాత్రి నుంచి అందుబాటులోకి వచ్చేసింది. ఉత్కంఠభరితమైన కథనం, గ్రిప్పింగ్ ట్విస్ట్‌లలో మిస్టరీ కథలను ఎంజాయ్ చేసే సినీ ప్రియులకు ఈ మూవీ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

కథ విషయానికి వస్తే…
ఒక నర్సు అనుమానస్పద మరణం తర్వాత మరికొంత మంది వరుసగా హత్యలకు గురవుతారు. ఈ హత్య కేసులలో క్రైమ్ రైటర్ నిందితుడిగా చిక్కుకుపోతాడు.. అయితే ఈ వరుస హత్యలకు పాల్పడిన నిందితులను గుర్తించేందుకు ఆ క్రైమ్ రైటర్ పోలీసులకు సహాయం చేస్తుంటాడు. మానవ శరీర భాగాలు సగం కాలిన స్థితిలో ఉన్న మూడు పెట్టేలు పోలీసులు గుర్తిస్తారు. దీంతో ఈ రహస్యాలను చేధించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్న సమయంలోనే ఓ పోలీసు అధికారి కనిపించకుండా పోతాడు. చివరకు ఈ మర్డర్ మిస్టరీలను ఎలా చేధించారు ? క్రైమ్ రైటర్ ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డాడు? అనేది ఈ సినిమా.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.