OTT Movie: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రియల్ స్టోరీ.. గుండె ధైర్యం ఉన్నవాళ్లు మాత్రమే చూడండి.. తెలుగులోనూ స్ట్రీమింగ్

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఉన్న క్రేజ్ వేరు. అందులోనూ నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాలేతై ఓ రేంజ్ లో థ్రిల్ ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా ఓ రియల్ స్టోరీనే. కర్ణాటక అడవుల్లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. బిగ్ బాస్ టాప్ కంటెస్టెంట్ తనూజ ఇందులో ఓ కీలక పాత్ర పోషించడం విశేషం.

OTT Movie: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రియల్ స్టోరీ.. గుండె ధైర్యం ఉన్నవాళ్లు మాత్రమే చూడండి.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Movie

Updated on: Nov 12, 2025 | 6:55 PM

ఈ మధ్యన ఓటీటీలో రియల్ స్టోరీలకు మంచి ఆదరణ దక్కుతోంది. వాస్తవ సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల జీవిత కథ ల ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమాలు, సిరీస్ లకు డిజిటల్ స్ట్రీమింగ్ లో రికార్డ్ వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీ కర్ణాటక బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కర్ణాటక అడవుల్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో టాప్ కంటెస్టెంట్ గా దూసుకెళుతోన్న తనూజ పుట్ట స్వామి ఇందులో కీలక పాత్ర పోషించడం విశేషం.  2010లో కర్ణాటకలో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. అప్పుడు ఈ భయంకరమైన సంఘటన నుంచి బయటపడ్డ ఓ వ్యక్తి దగ్గర దొరికిన కెమెరాలోని ఫుటేజ్ ని తీసుకొని సినిమాగా రూపొందించారు. ఫౌండ్ ఫుటేజ్ అనే అంశం ఆధారంగా తెరకెక్కిన ఈ హారర్ థ్రిల్లర్ కన్నడ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కేవలం రూ. 30 లక్షలలో నిర్మించిన ఈ మూవీ ఏకంగా 5 కోట్లు కొల్లగొట్టింది. సినిమా కథ విషయానికి వస్తే.. కొంత మంది యువకులు ట్రెక్కింగ్ కోసం అడవిలోకి వెళ్తారు. అక్కడ ఒక డాక్యుమెంటరీని షూట్ చేయాలని ప్లాన్ చేస్తారు. అడవిలోని ఎత్తైన శిఖరాన్ని చేరుకోవాలని లక్ష్యంతో ప్రయాణం సాగిస్తారు. కానీ ఉన్నట్లుండి అడవిలో వారికి వింత అనుభవాలు ఎదురవుతాయి. భయపెట్టే సంఘటనలు కూడా జరుగుతాయి. మరి ఎత్తైన శిఖరాన్ని చేరుకోవాలన్న యువకుల లక్ష్యం నెరవేరిందా? మధ్యలో వారికి ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి? అసలు వీరి అడవి నుంచి బయట పడ్డారా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఆద్యంతం ఆసక్తికర సన్నివేశాలు, ఉత్కంఠభరిత ట్విస్టులతో సాగే సినిమా పేరు చిత్రమ్ కాదు నిజమ్. కన్నడలో 6-5=2 పేరుతో రిలీజ్ చేశారు. ఇందులో తనూజతో పాటు కృష్ణ ప్రసాద్, తనూజ, జాను, విజయ్ చందు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం సినిమా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇక యూట్యూబ్ లోనూ సినిమా ఫ్రీగానే స్ట్రీమింగ్ అవుతుండడం విశేషం. అయితే ఇందులో కొన్ని సన్నివేశాలు మరీ భయానకంగా ఉన్నాయి. కాబట్టి పిల్లలతో కలిసి చూడకపోవడమే మంచిది. అలాగే గుండె సమస్యలున్నవారు కూడా సినిమాకు దూరంగా ఉంటే మేలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.