
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాలో మలయాళం అందాల తార మమితా బైజు హీరోయిన్ గా చేసింది. అలాగే సీనియర్ హీరోయిన్లు రాధిక, రవినా టాండన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 14న విడుదలైన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మొదటి నాలుగు రోజుల్లోనే రూ. 150 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సూర్య కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది. సూర్య నటన, మమితా బైజు అల్లరి, రాధిక, రవీనా టాండన్ ల అభినయం, డైరెక్టర్ వెంకీ అట్లూరి టేకింగ్, అలాగే జీవీ ప్రకాశ్ కుమార్ పాటలు.. వెరసి విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాను బ్లాక్ బస్టర్ రేంజ్ కు తీసుకెళ్లాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ఫ్యామిలీ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. అందుకే రిలీజై రెండు వారాలు గడుస్తున్నా, మధ్యలో కొత్త సినిమాలు వచ్చినా సూర్య సినిమాకు హౌస్ ఫుల్ కలెక్షన్లు వస్తున్నాయి. తమిళంలో కంటే తెలుగులోనే విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాకు భారీగా కలెక్షన్లు వస్తుండడం విశేషం. ఇదిలా ఉంటే థియేటర్లలో బ్లాక్ బస్టర్ రేంజ్ సాధించిన ఈ సినిమాను ఓటీటీలోనూ చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఓటీటీ రిలీజ్ కు సంబంధించి ఒక విషయం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే థియేట్రికల్ రిలీజ్ తర్వాత నాలుగు వారాలకే ఈ మూవీని ఓటీటీలోకి తీసుకురావాలని ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ సెప్టెంబర్ 14 వ తేదీన స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలుగు, తమిళంతో పాటు హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఒకేసారి సూర్య సినిమా స్ట్రీమింగ్ కు రానున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో చాలా మంది స్టార్స్ నటించారు. నాజర్, సునీల్ రెడ్డి, రాజీవ్ మేనన్, హర్ష చెముడు, కాళి వెంకట్, దీపా శంకర్, హైపర్ ఆది, మైమ్ గోపి, సర్వదమన్ బెనర్జీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.