ఇటీవల చిన్న చిత్రాలు కూడా సంచలన విజయాలు సాధిస్తున్నాయి. ఆకట్టుకునే కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే కొన్ని చిన్న సినిమాల్లో కంటెంట్ బాగుతున్నా ప్రమోషన్ లేకపోవడంతో మరుగున పడిపోతున్నాయి. అయితే ఇలాంటి సినిమాలకు ఓటీటీ మంచి వేదికగా నిలిచింది. థియేటర్లలో ఆడకపోయినా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌పై మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయి. అలా గతంలో థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేని ఓ చిన్న సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. అదే సురాపానం.. కిక్ అండ్ ఫన్ అనేది ట్యాగ్ లైన్. ఫాంటసీ థ్రిల్లర్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ తెరకెక్కిన ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు హీరోగానూ నటించాడు సంపత్. కథానాయకిగా ప్రగ్యా నయన్ మెరిసింది. అలాగే అజయ్ ఘోష్, సూర్య, ఫిష్ వెంకట్, మీసాల లక్ష్మణ్, చమ్మక్ చంద్ర, విద్యాసాగర్, అంజి బాబు, మాస్టర్ అఖిల్ తదితరులు ప్రధాన పాత్రల్లో మెరిశారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందించడం విశేషం. జూన్ 10న థియేటర్లలో విడుదలైన సురాపానం పెద్దగా ఆడలేదు. సరికొత్త కాన్సెప్ట్, కంటెంట్ ఉన్నా సరైన ప్రమోషన్లు చేయకపోవడంతో ఈ మూవీ పెద్దగా జనాల్లోకి వెళ్లలేదు. అయితే సురాపానం సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ఈ ఫాంటసీ థ్రిల్లర్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ అందుబాటులోకి వచ్చేసింది.
మధు యాదవ్ మట్ట నిర్మించిన సురాపానం సినిమాకు రాజేంద్రప్రసాద్ చిరుత మాటలే అందించారు. సినిమాటోగ్రఫి బాధ్యతలను విజయ్ ఠాగూర్ నిర్వర్తించారు. ఇక సినిమా కథ విషయానికొస్తే.. తెలంగాణలోని ఓ పల్లెటూరిలో చిల్లర దొంగతనాలు చేస్తుంటాడు హీరో శివ (సంపత్). అయితే అనుకోకుండా అతనికి ఓ శివుడి ప్రతిమతో కూడిన బాక్స్ దొరుకుతుంది. అందులో చిన్న సీసాలో పానీయం కూడా ఉంటుంది. అది తాగిన తర్వాత శివుడి ప్రతిమ కనిపించకుండా పోతుంది. మరి సీసాలోని ద్రవాన్ని తాగిన శివకు ఏమైంది? శివుడి ప్రతిమ ఏమైందో తెలుసుకోవాలంటే సురాపానం సినిమా చూడాల్సిందే.
#Surapanam OTT RELEASE NOW @ahavideoIN pic.twitter.com/G6DRJKbFsh
— OTTGURU (@OTTGURU1) October 23, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..