జబర్ధస్త్ కమెడియన్‌గా కెరీర్ ఆరంభించి హీరోగా మారాడు సుడిగాలి సుధీర్. సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాతో వెండితెరపై సందడి చేసిన సుధీర్.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు. అయితే ఆయన నటించిన సినిమాలన్ని అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఇటీవల విడుదలైన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గాలోడు చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి సారి ఫుల్ మాస్ యాక్షన్ అవతారంలో కనిపించారు సుధీర్. ఈ సినిమాకు డైరెక్టర్ పులిచర్ల రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించగా.. ఇప్పటివరకు సుధీర్ కెరీర్‌తో భారీ రెస్పాన్స్ అందుకున్న చిత్రంగా నిలిచింది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమయ్యింది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 17న ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు ఆహా మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే థియేటర్లలో పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలా మెప్పిస్తోందో చూడాలి.
ఈ చిత్రంలో సుధీర్ సరసన గెహన సిప్పి కథానాయికగా నటించగా.. భీమ్స్ సంగీతం అందించాడు. మరోవైపు ఇటు సినిమాలతోపాటు.. అటూ యాంకర్ గానూ పలు షోలతో అలరిస్తున్నారు సుధీర్.
Dance irukku… Comedy irukku…
Action Irukku… Full on entertainment irukku… Sensational hit Galoodu Premieres Feb 17 only on aha?#GalooduOnAHA #SudigaliSudheer @sudheeranand @gehna_sippy @SamskruthiFilms @PRDuddiSreenu pic.twitter.com/qvoi7INvtp— ahavideoin (@ahavideoIN) February 11, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.