Sita Ramam : ఒకేరోజు ఓటీటీలో ఈ బ్లాక్ బస్టర్ చిత్రాలు చూడొచ్చు.. సీతారామంతోపాటు..

|

Sep 07, 2022 | 7:43 PM

ఈ సంవత్సరం విడుదలైన ఉత్తమ ప్రేమకథలలో ఒకటిగా నిలిచిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 9న స్ట్రీమింగ్ కానుంది

Sita Ramam : ఒకేరోజు ఓటీటీలో ఈ బ్లాక్ బస్టర్ చిత్రాలు చూడొచ్చు.. సీతారామంతోపాటు..
Sitaramam
Follow us on

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన లేటేస్ట్ చిత్రం సీతారామం. డైరెక్టర్ హనురాఘవపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్ట్ 5న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. పీరియాడికల్ నేపథ్యంలో రూపొందిన ఈ అందమైన ప్రేమకథ దక్షిణాది ప్రేక్షకులను ఆక్టటుకుంది. అన్ని వర్గాల ఆడియన్స్ హృదయాలను తాకిన ఈ మూవీ ఇప్పుడు బాలీవుడ్ లోనూ దూసుకుపోతుంది. కేవలం సినిమా మాత్రమే కాకుండా ఇందులోని సాంగ్స్ సైతం యూట్యూబ్ ను షేక్ చేస్తున్నారు. విడుదలై నెల రోజులు పూర్తైన సీతారామం క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇక ఇప్పుడు ఓటీటీలో సందడి చేయనుంది. ఈ సంవత్సరం విడుదలైన ఉత్తమ ప్రేమకథలలో ఒకటిగా నిలిచిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 9న స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాతో పాటు.. మరిన్ని చిత్రాలు సైతం ఓటీటీలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.

అలాగే మరోవైపు ఆహాలో సెప్టెంబర్ 9న భీమ్లానాయక్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అయితే సీతారామంతో పాటు విడుదలైన బింబిసార కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ కోసం ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. కానీ ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఇప్పటివరకు అప్డేట్ రాలేదు. ఇక సెప్టెంబర్ 9న థియేటర్లలో బ్రహ్మాస్త్ర, ఒకే ఒక జీవితం చిత్రాలు కూడా విడుదల కానున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.