బిగ్ బాస్ షోలో ఎంటరైన తర్వాత పాపులారిటీని సాధించడం అటుంచితే.. ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్‌తో హౌస్‌లోకి అడుగుపెట్టి కొంతమంది కంటెస్టెంట్లు నెగిటివిటీని మూతగట్టుకున్నారు. ఇదిలా ఉంటే.. తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ఇటీవల ముగిసింది. ఇందులో పాల్గొన్న షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్‌లు పూర్తి నెగిటివిటీని మూతగట్టుకున్నారు. హౌస్‌లో వీరిద్దరూ ప్రవర్తించిన తీరు ప్రేక్షకులకు రోత పుట్టించింది.
మరోవైపు షణ్ముఖ్, దీప్తిల ఐదేళ్ల ప్రేమ బంధం బిగ్ బాస్ ముగిసిన వెంటనే ముగింపుకు రాగా.. సిరి-శ్రీహన్‌ల లవ్ లైఫ్ కూడా బీటలు వారుతోందని టాక్. బిగ్ బాస్ ముగిసే దాకా సిరికి మద్దతుగా నిలిచిన ఆమె ప్రియుడు శ్రీహన్.. ఇటీవల సిరితో కలిసున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేశాడు. కేవలం వారిద్దరూ కలిసి నటించిన వెబ్‌సిరీస్‌లకు సంబంధించిన ఫోటోలను మాత్రమే ఉంచాడు. దీనితో వీరిద్దరూ త్వరలోనే బ్రేకప్ చెప్పుకోనున్నారని వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం శ్రీహన్‌కు సంబంధించి ఓ వార్త ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.
వచ్చే నెలలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ ఓటీటీలోకి శ్రీహన్‌ను తీసుకురావాలని బిగ్ బాస్ యూనిట్ ఆలోచిస్తోందట. ఈ మేరకు సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్. అయితే ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చేందుకు శ్రీహన్ విముఖత చూపిస్తున్నట్లు సన్నిహితుల మాట. మరి చివరికి ఏం జరుగుతుందో అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.!