OTT Movie: అఫీషియల్.. 20 రోజులకే ఓటీటీలో సంక్రాంతి సూపర్ హిట్ మూవీ.. కడుపుబ్బా నవ్వుకోడానికి రెడీగా ఉండండి

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా మొత్తం ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ప్రభాస్ ది రాజాసాబ్, చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

OTT Movie: అఫీషియల్..  20 రోజులకే ఓటీటీలో సంక్రాంతి సూపర్ హిట్ మూవీ.. కడుపుబ్బా నవ్వుకోడానికి రెడీగా ఉండండి
Naari Naari Naduma Murari Movie

Updated on: Jan 30, 2026 | 6:08 PM

టాలీవుడ్ ప్రామిసింగ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’. గతంలో సామజవరగమన లాంటి హిలేరియట్ ఎంటర్ టైనర్ మూవీని తెరకెక్కించిన రామ్ అబ్బరాజు ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. శర్వానంద్ సరసన సంయుక్త మేనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు వంటి స్టార్ హీరోల సినిమాలను తట్టుకుని మరీ మంచి వసూళ్లు సాధించింది. లో బడ్జెట్ తో తెరకెక్కిన ‘నారీ నారీ నడుమ మురారి’ సుమారు రూ. 20 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించి నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. థియేటర్లలో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించి ఈ హిలేరియస్ ఎంటర్ టైనర్ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 04 నుంచి ఈ సూపర్ హిట్ మూవీ ఓటీటీలోకి రానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ ఓటీటీనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. . ‘ప్రేమ, అబద్ధాలు, చాలా అయోమయంతో కూడిన యూనియన్ కు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం’ అంటూ ఈ ఈ మేరకు నారీ నారీ నడుము మురారీ మూవీ కొత్త పోస్టర్ ను పంచుకుంది. కాగా తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ శర్వానంద్ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది

నారీ నారీ నడుము మురారీ సినిమాలో భారీ తారగణమే ఉంది. వీకే నరేష్, వెన్నెల కిశోర్, సునీల్, సత్య, సిరి హనుమంత్, మదునందన్, సంపత్ రాజ్, రఘుబాబు, సుదర్శన్, గెటప్ శీను తదితరులు ప్రధాన పాత్రల్లో మెరిశారు. అలాగే యంగ్ హీరో శ్రీ విష్ణు స్పెషల్ క్యామియో రోల్ పాత్రలో సందడి చేశాడు. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌, ఎకె ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిరించిన ఈ సినిమాకు విశాల్ చంద్ర శేఖర్ స్వరాలు సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

కథేంటంటే..

బీటెక్‌ చేసి ఆర్కిటెక్ట్‌గా పని చేస్తున్న గౌతమ్‌ (శర్వానంద్‌). నిత్య (సాక్షి వైద్య)తో ప్రేమలో ఉంటాడు. ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి పీటలెక్కాలని అనుకుంటాడు. ఈ పెళ్లికి తొలుత నిత్య తండ్రి రామలింగం (సంపత్‌ రాజ్‌) అడ్డు చెప్పినా.. తర్వాత అంగీకరిస్తాడు. ఆ పెళ్లి రిజిస్టర్‌ ఆఫీస్‌లో జరగాలని షరతు పెడతాడు. తప్పని పరిస్థితుల్లో దీనికి గౌతమ్‌ ఓకే అంటాడు. అలా పెళ్లికి దరఖాస్తు చేసుకున్నాక గౌతమ్‌కు ఓ అనుకోని చిక్కు ఎదురవుతుంది. దానికి, కాలేజీలో ప్రేమించిన దియా (సంయుక్త)కు ఉన్న సంబంధం ఏంటి? అసలు వాళ్లిద్దరూ ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ రెండు ప్రేమకథల వల్ల గౌతమ్‌ తండ్రి కార్తీక్‌ (నరేశ్‌) – పిన్ని పల్లవి (సిరి హనుమంతు)ల దాంపత్య జీవితం విడాకుల దాకా ఎందుకు వెళ్లింది? ఈ కథలో లవకుశ (సత్య), సత్యమూర్తి (సునీల్‌), గుణశేఖర్‌ (వెన్నెల కిశోర్‌) తదితరుల పాత్రలకు ప్రాధాన్యమెంత? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.