2003లో దేశాన్ని ఒక కుదుపు కుదిపేసిన నకిలీ స్టాంప్ పేపర్ల కుంభకోణం ఆధారంగా తెరకెక్కించిన వెబ్ సిరీస్ స్కామ్ ‘2003.. ది తెల్గీ స్టోరీ’. ఈ కుంభకోణంలో అరెస్టై జైలులోనే కన్నుమూసిన అబ్దుల్ కరీం తెల్గీ జీవితంలోని వాస్తవ సంఘటలను ఈ వెబ్‌సిరీస్‌లో చక్కగా చూపించారు. రెండు భాగాలుగా రూపొందిన ఈ సిరీస్ పార్ట్-1 సెప్టెంబర్ 2న ప్రముఖ ఓటీటీ వేదిక సోనీలివ్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. సూపర్ హిట్ టాక్ రావడంతో పాటు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. మొదటి పార్ట్‌లో కర్ణాటకలోని ఖానాపూర్‌కు చెందిన అబ్దుల్ కరీం తెల్గీ ఉద్యోగం కోసం కుటుంబాన్ని వదిలి ముంబయి రావడం, అక్కడ కొందరు స్నేహితులను కలవడం, నకిలీ స్టాంప్ పేపర్లను ముద్రించడం వంటి అంశాలను ఎంతో ఆసక్తికరంగా చూపించారు మేకర్స్. అయితే కరీం తెల్గీ స్టాంప్ పేపర్ల కుంభ కోణం ఎలా బయటపడింది? దీని వెనక బాధ్యులు అన్నది మాత్రం చూపించలేకపోయారు. జైలులో తెల్గీకి ఎలాంటి పరిస్థితులు ఎదరయ్యాయి? అన్నది రెండో భాగంలో చూపించనున్నారు. ఈ క్రమంలో స్కామ్ 2023 పార్ట్‌కు సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. నవంబర్ 3వ తేదీ నుంచి రెండో భాగాన్ని స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు అధారకారికంగా ప్రకటించారు. మొదటి పార్ట్‌లో మొత్తం 5 ఎపిసోడ్స్ ఉంటే రెండో పార్ట్‌లో కూడా ఐదు ఎపిసోడ్సే ఉండనున్నట్లు సమాచారం.
స్కామ్ 2023 ది తెల్గీ స్టోరీ వ్యాల్యూమ్ 2 కు సంబంధించి ఒక టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్ . ఇందులో తెల్గీ జైలు జీవితం, పోలీసుల విచారణ వంటి అంశాలను చూపించారు. తుషార్ హీరానందని తెరకెక్కించిన స్కామ్ 2023 వెబ్ సిరీస్‌లో అబ్దుల్ కరీం పాత్రలో గగన్ దేవ్ రియార్ నటించారు. అలాగే అనిరుద్ధ్ రాయ్, సత్యం శ్రీవాస్తవ, విశాల్ సి. భరద్వాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
Sabki zubaan pe tha Telgi ka naam, par Telgi ki zubaan pe kiska? Find out on 3rd November!
Scam 2003-The Telgi Story, all episodes, streaming on 3rd November, only on Sony LIV
#Scam2003OnSonyLIV #Scam2003Thanking @BajpayeeManoj for lending his incredible voice ✨ pic.twitter.com/wLz04HZLcW
— Sony LIV (@SonyLIV) October 18, 2023
Rounding up our favourite scenes from the show. Which one tops the list for you? Tell us in the comments below 👇
Watch Scam 2003 on @SonyLIV #Scam2003 #Scam2003OnSonyLIV pic.twitter.com/hUAOHIhani
— Applause Entertainment (@ApplauseSocial) October 13, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..