The Baker And The Beauty: అటు రొమాన్స్.. ఇటు కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న ‘ది బేకర్ అండ్ ది బ్యూటీ’

|

Sep 10, 2021 | 8:09 PM

The Baker And The Beauty: తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త వినోదాన్ని అందిస్తూ దూసుకుపోతోంది 'ఆహా' ఓటీటీ. ఈ కోవలోనే తాజాగా మరో సరికొత్త వెబ్ సిరీస్‌ను..

The Baker And The Beauty: అటు రొమాన్స్.. ఇటు కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న ది బేకర్ అండ్ ది బ్యూటీ
Baker And The Beauty
Follow us on

తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త వినోదాన్ని అందిస్తూ దూసుకుపోతోంది ‘ఆహా’ ఓటీటీ. ఈ కోవలోనే తాజాగా మరో సరికొత్త వెబ్ సిరీస్‌ను విడుదల చేసింది. యంగ్ హీరో సంతోష్ శోభన్, టీనా శిల్పరాజ్ జంటగా నటించిన ”ది బేకర్ అండ్ ది బ్యూటీ” వినాయక చవితి సందర్బంగా ఇవాళ్టి నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి వెబ్ సిరీస్ ఎలా ఉందో.? ప్రేక్షకులు ఎన్ని మార్కులు వేశారో.? ఈ రివ్యూలో చూసేద్దాం పదండి.!

కథ:

బేకరీ నిర్వహించే మిడిల్ క్లాస్ యువకుడు విజయ్(సంతోష్ శోభన్).. మహి (విష్ణు ప్రియ)తో కలిసి ఓ అన్-హ్యాపీ రిలేషన్‌షిప్‌లో ఉంటాడు. అటు వైపు ఫిల్మ్ స్టార్ ఐరా వాసిరెడ్డి(టీనా)కి రీసెంట్‌గా తన బాయ్‌ ఫ్రెండ్‌తో బ్రేకప్ అవుతుంది. అసలు విజయ్, ఐరా ఎలా కలిశారా.? ఆ తర్వాత వారి జీవితాల్లో జరిగిన సంఘటనలు ఏంటి.? చివరికి ఏమైందన్నది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ.!

విశ్లేషణ:

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ వెబ్‌ సిరీస్‌లో ప్రతీ ఎమోషన్‌ను అద్భుతంగా చూపించారు. ఇద్దరు భిన్న మససులైన బేకర్ అండ్ ఫిలిం స్టార్ మధ్య జరిగే ప్రేమ.. గొడవలు, భావోద్వేగాల మధ్య సాగే ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సిరీస్ నిర్మాణ విలువలు భాగున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ సిరీస్‌కు అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. ఈ సిరీస్‏కు జొనాథన్ ఎడ్వర్ట్స్ దర్శకత్వం వహించగా.. వెంకట్, సాయి శ్వేత, సంగీత్ శోభన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఝాన్సీ లక్ష్మీ కీలక పాత్రలలో నటించారు. ఈ సిరీస్‌కు ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించారు. పది ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్‌కు నిర్మాత సుప్రియా యార్లగడ్డ స్క్రిప్ట్ సూపర్‌వైజర్‏గా వ్యవహరించారు.

ప్లస్ పాయింట్స్:

ప్రధాన పాత్రధారుల నటన, బ్యాగ్రౌండ్ స్కోర్, నిర్మాణ విలువలు, ఎమోషన్స్

మైనస్ పాయింట్స్:

అక్కడక్కడా కొన్ని సీన్స్, ఎడిటింగ్

ఫైనల్ టాక్: ది బేకర్ అండ్ ది బ్యూటీ- డీసెంట్ రొమాంటిక్-కామెడీ సిరీస్