Martin Luther King: ఒకరోజు ముందుగానే ఓటీటీలోకి వచ్చేసిన ‘మార్టిన్ లూథర్ కింగ్’.. సంపూర్ణేష్ సినిమా ఎక్కడ చూడొచ్చంటే..

|

Nov 29, 2023 | 7:41 AM

కొన్ని సినిమాలు మాత్రం చెప్పిన డేట్ కంటే ముందే డిజిటిల్ ప్లాట్ ఫాంపైకి వచ్చేశాయి. అందులో మార్టిన్ లూథర్ కింగ్ ఒకటి. అక్టోబర్ 17న విడుదలైన ఈ మూవీ మిశ్రమ స్పందన అందుకుంది. ఇందులో బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు ప్రధాన పాత్రలో నటించగా.. పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. కేరాఫ్ కంచరపాలెం సినిమా డైరెక్టర్ వెంకటేశ్ మహా ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లై అందించి కథకు అనుగుణంగా మార్పులు చేశారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది.

Martin Luther King: ఒకరోజు ముందుగానే ఓటీటీలోకి వచ్చేసిన మార్టిన్ లూథర్ కింగ్.. సంపూర్ణేష్ సినిమా ఎక్కడ చూడొచ్చంటే..
Martin Luther King
Follow us on

అటు థియేటర్లలో ఈ వారం సినిమాల సందడి స్టార్ట్ కాబోతుంది. డిసెంబర్ 1న భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ రిలీజ్ కాబోతున్నాయి. అలాగే.. ఇటు ఓటీటీలోను ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీస్ రాబోతున్నాయి. నవంబర్ 30న దాదాపు 20 చిత్రాలకు పైగా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం చెప్పిన డేట్ కంటే ముందే డిజిటిల్ ప్లాట్ ఫాంపైకి వచ్చేశాయి. అందులో మార్టిన్ లూథర్ కింగ్ ఒకటి. అక్టోబర్ 17న విడుదలైన ఈ మూవీ మిశ్రమ స్పందన అందుకుంది. ఇందులో బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు ప్రధాన పాత్రలో నటించగా.. పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. కేరాఫ్ కంచరపాలెం సినిమా డైరెక్టర్ వెంకటేశ్ మహా ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లై అందించి కథకు అనుగుణంగా మార్పులు చేశారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది.

మార్టిన్ లూథర్ కింగ్ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లా్ట్ ఫాంలో నవంబర్ 29న స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ స్పందించారు. అయితే చెప్పిన డేట్ కంటే ముందే అంటే నవంబర్ 28న ఈ సినిమా సోనీ లివ్ లో తెలుగుతోపాటు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో శరణ్య ప్రదీప్, నరేశ్, వెంకటేశ్ మహా కీలకపాత్రలు పోషఇంచారు. ఈ చిత్రానికి స్మరణ్ సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

ఈ సినిమా ఓటు విలువను తెలియజేసేలా.. ఓటు ఎంత శక్తిమంతమైనదో చెబుతుంది. పొలిటికల్ సెటైర్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కించారు. కథ విషయానికి వస్తే.. తమకు ఓటు వేయాలంటూ ఇద్దరు రాజకీయ నాయకులు మార్టిన్ లూథర్ కింగ్ (సంపూ)ను ప్రలోభాలకు గురిచేస్తారు. అయితే అప్పటివరకు అనామకుడిగా ఉన్న అతడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అన్నదే మార్టిన్ లూథర్ కింగ్ చిత్రం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.