Virupaksha OTT: గెట్ రెడీ.. ‘విరూపాక్ష’ ఓటీటీలోకి వచ్చేస్తోందోచ్.. ఎక్కడ చూడొచ్చునంటే..

|

May 16, 2023 | 1:02 PM

సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'విరూపాక్ష'. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..

Virupaksha OTT: గెట్ రెడీ.. విరూపాక్ష ఓటీటీలోకి వచ్చేస్తోందోచ్.. ఎక్కడ చూడొచ్చునంటే..
Virupaksha
Follow us on

సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’. ఏప్రిల్ 21వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ హిట్‌ అందుకుంది. ఇక ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీల్లోకి వస్తుందోనన్న ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు.. అఫీషియల్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా విరూపాక్ష రిలీజ్ డేట్‌పై ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. మే 21 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్‌కి అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ‘మూడో కన్నుతో మాత్రమే చూడగలిగే ఒక నిజం రాబోతోంది. మీరు చూడడానికి సిద్దంకండి’ అని ట్వీట్ చేసింది. కాగా, బాక్సాఫీస్ దగ్గర విరూపాక్ష భారీ వసూళ్లు రాబట్టిన విషయం విదితమే. రిలీజైన తొలి రోజే సక్సెస్ టాక్ తెచ్చుకుని.. నాలుగు రోజుల్లోనే 50 కోట్ల గ్రాస్ సాధించింది. అలాగే ప్రస్తుతం నాలుగో వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమా రూ. 100 కోట్ల వైపుగా పరుగులు పెడుతోంది.