
యంగ్ హీరో రోషన్ మేక నటించిన లేటేస్ట్ మూవీ ఛాంపియన్. పెళ్లి సందడి తర్వాత చాలా కాలం పాటు బ్రేక్ తీసుకున్న రోషన్.. మూవీతో హిట్టు అందుకున్నాడు. గతేడాది డిసెంబర్ 25న విడుదలైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిర్మాత స్వప్న దత్ నిర్మించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మూవీకి అంతగా కలెక్షన్స్ రాకపోయినా.. నటుడిగా తన సహజ నటనతో ప్రశంసలు అందుకున్నాడు రోషన్. ఇందులో మలయాళీ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ కథానాయికగా నటించింది.
ఎక్కువ మంది చదివినవి : Trivikram : ఆ పాట విని ఆశ్చర్యపోయా.. తెలుగు డిక్షనరీ కొని మరీ అర్థం వెతికాను.. త్రివిక్రమ్ శ్రీనివాస్..
తెలుగులో మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది అనస్వర. ముఖ్యంగా ఈ సినిమాలోని గిర గిర సాంగ్ సోషల్ మీడియాలో ఎంతగా ట్రెండ్ అయ్యిందో చెప్పక్కర్లేదు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాను జనవరి 29న ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషలలో స్ట్రీమింగ్ కానుంది.
ఎక్కువ మంది చదివినవి : Ravi Babu: అంత కష్టపడి సినిమా తీస్తే నిర్మాత మోసంతో ఎవరినీ నమ్మలేకపోతున్నా.. నటుడు రవిబాబు ..
దాదాపు రూ.45 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా కేవలం రూ.17 కోట్లు మాత్రమే రాబట్టినట్లు టాక్. ఇందులో సంతోష్ ప్రతాప్, అవంతిక, కృతి కంజ్ సింగ్ రాథోడ్, హైపర్ ఆది కీలకపాత్రలు పోషించారు. మిక్కీ జే మేయర్ అందించిన ఈ సినిమాకు మరో హైలెట్ అయ్యింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది.
ఎక్కువ మంది చదివినవి : Trivikram Srinivas: అతడు కెమెరా కోసమే పుట్టాడు.. నాకు ఇష్టమైన హీరో.. త్రివిక్రమ్ ప్రశంసలు..
Football ground ki champion kaani rangam lo… sainikudu 🏆💪 pic.twitter.com/4MLXtY6YnT
— Netflix India South (@Netflix_INSouth) January 24, 2026
ఎక్కువ మంది చదివినవి : అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసిన సాంగ్.. భాష అర్థం కాకపోయినా కుర్రాళ్లకు పిచ్చెక్కించేసింది.. ఆ గ్లామర్ హీరోయిన్ ఏం చేస్తుందంటే..