టైగర్ నాగేశ్వర రావు సినిమాతో మాస్ మాహారాజా రవితేజ ఖాతాలో మరో హిట్టు చేరింది. ధమాకా సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేసిన రవితేజ.. ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి విజయాన్ని అందుకున్నారు. అడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా.. కమర్షియల్ గా మెప్పించలేకపోయింది. డైరెక్టర్ వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 1980లో తెలుగు రాష్ట్రాల్లో గజదొంగగా చెలామణి అయిన స్టూవర్టుపురం నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ చెల్లెలు నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించగా.. సీనియర్ హీరోయిన్ రేణు దేశాయ్ హేమలత లవణం పాత్రలో నటించారు. ఇదిలా ఇంటే.. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
నవంబర్ 24న ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయనున్నారనే టాక్ వినిపిస్తుంది. ఈసినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం అమెజాన్ దాదాపు రూ. 15 కోట్లు చెల్లించినట్లు సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటన మాత్రం రాలేదు. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమా తెలుగులో మాత్రమే మంచి విజయం సాధించింది. మిగతా భాషలలో అంతగా ప్రభావం చూపలేకపోయింది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రవితేజ ఈగల్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కార్తిక ఘట్టమనేని తెరకెక్కిస్తుండగా.. అనుపమ పరమేశ్వరన్, నవదీప్, అవసరాల శ్రీనివాస్, మధుబాల, కావ్య థాపర్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. యాక్షన్ కథాంశంతో రాబోతున్న ఈ సినిమాలో రవితేజ కొత్త గెటప్ లో కనిపింనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.