Dhurandhar OTT: ఓటీటీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ధురంధర్’! 1200 కోట్ల సినిమా స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ధురంధర్'. గతేడాది డిసెంబర్ లో రిలీజైన ఈ బాలీవుడ్ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రూ.1200 కోట్లకు పైగా వసూలు చేసి 2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది.

Dhurandhar OTT: ఓటీటీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ధురంధర్! 1200 కోట్ల సినిమా స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Ranveer Singh Dhurandhar Movie

Updated on: Jan 06, 2026 | 6:35 AM

రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ధురంధర్’. ‘ఉరి’ ఫేమ్ ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన స్పై ఈ యాక్షన్ థ్రిల్లర్ లో అక్షయ్ ఖన్నా, సారా అర్జున్, ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం. కాగా ధురంధర దాటికి ఇప్పటికే పలు రికార్డులు బద్దలయ్యాయి. 2025లో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన ఇండియన్ మూవీగా ధురందర్ రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాదు ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల జాబితాల్లో టాప్-5లో నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో ఆడుతోంది. కాబట్టి రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు తుడిచిపెట్టుకుపోయే అవకాశముంది. అయితే ఇప్పుడీ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలో అలరించడానికి రెడీ అవుతోందని సమాచారం.

ధురంధర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దాదాపు రూ.130 కోట్లకి ఈ మూవీ డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవల ఎంత పెద్ద సినిమా అయినా 8 వారాల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది ఈ క్రమంలో జనవరి 30 నుంచి ‘ధురంధర్’ సినిమాని నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. హిందీతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం భాషల్లోనూ ధురంధర్ స్ట్రీమింగ్ కు రానుంది.

ఇవి కూడా చదవండి

ఇప్పటికీ థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి