Lal Salaam OTT: ఎట్టకేలకు ఓటీటీలో రజనీకాంత్ ‘లాల్ సలామ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

|

Apr 08, 2024 | 4:52 PM

జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన చిత్రం లాల్ సలామ్. రజనీ గారాల పట్టి ఐశ్వర్య ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. విష్ణు విశాల్, విక్రాంత్ తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. మొదట రజనీది ఇందులో అతిథి పాత్ర అనుకున్నారు కానీ సినిమా మొత్తం ఆయన చుట్టే తిరుగుతుంది.

Lal Salaam OTT: ఎట్టకేలకు ఓటీటీలో రజనీకాంత్ లాల్ సలామ్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Rajinikanth Lal Salaam Movie
Follow us on

జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన చిత్రం లాల్ సలామ్. రజనీ గారాల పట్టి ఐశ్వర్య ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. విష్ణు విశాల్, విక్రాంత్ తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. మొదట రజనీది ఇందులో అతిథి పాత్ర అనుకున్నారు కానీ సినిమా మొత్తం ఆయన చుట్టే తిరుగుతుంది. భారీ అంచనాలతో ఫిబ్రవరి 9న థియేటర్లలో విడుదలైన లాల్ సలామ్ ఆడియెన్స్ ను తీవ్రంగా నిరాశపర్చింది. తమిళ్ తో పాటు తెలుగులోనూ ఈ సినిమాకు చాలా తక్కువ కలెక్షన్లు వచ్చాయి. స్వయంగా డైరెక్టర్ ఐశ్వర్యే తమ సినిమా పరాజయానికి గల కారణాలను పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. అయితే సినిమాఓ రజనీకాంత్ పోషించిన మొయీద్దీన్ భాయ్‌ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. తలైవా స్టైలిష్ లుక్, అభినయం అభిమానులను అలరించాయి. ఇలా థియేటర్లలో మిక్స్ డ్ రెస్పాన్స్ తెచ్చుకున్న లాల్ సలామ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. రజనీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సన్ నెక్ట్స్ కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో తమిళ నూతన సంవత్సరం కానుకగా ఏప్రిల్ 12 నుంచి లాల్ సలామ్ సినిమాను ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకురానున్నారు. తమిళ్ తో పాటు తెలుగులోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది.

సాధారణంగా థియేటర్లలో విడుదలైన సినిమా నెల రోజుల్లోపే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలు కూడా నాలుగు వారాల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ బాట పడుతున్నాయి. కానీ లాల్ సలామ్ సినిమా మాత్రం అనుకోని కారణాలతో ఓటీటీ రిలీజ్ వాయిదా పడుతోంది. ప్రతివారం లాల్ సలామ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే అంటూ వార్తలు వచ్చినా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే ఎట్టకేలకు రెండు నెలల తర్వాత సన్ నెక్ట్స్ వేదికగా లాల్ సలామ సినిమా స్ట్రీమింగ్ కు వస్తోంది.

ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌ లాల్ సలామ్ సినిమాను రూపొందించింది. ఏ సుభాస్కరన్ నిర్మాతగా వ్యవహరించారు.  టీమిండియా దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్, జీవితా రాజశేఖర్ రజనీ కాంత్ సినిమాలో కీలక పాత్రలు పోషించడం విశేషం. అలాగే లివింగ్ స్టన్, సెంతిల్, తంబి రామయ్య, నిరోషా, వివేక్ ప్రసన్నా, ధన్యా బాలకృష్ణ, తంగదురై తదితరులు కూడా వివిధ పాత్రల్లో మెరిశారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ లాల్ సలామ్ సినిమాకు సంగీతం అందించడం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి