
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ ప్రతి ఆదివారం ఓ సరికొత్త సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొస్తోంది. కథా సుధ పేరుతో వస్తోన్న ఈ సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అలా ఈ ఆదివారం (మార్చి 15) కూడా సండే స్పెషల్ గా ఓ సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఈటీవీ విన్ లో అందుబాటులోకి వచ్చింది. ఇందులో సీనియర్ నటుడు రాజీవ్ కనకాల కీలక పాత్ర పోషించాడు. అలాగే బిగ్ బాస్ ఫేమ్ వాసంతి , మాధురి, ఆర్యన్, జోష్న, అయేషా, మాధవ్ తదితరులు ఇతర పాత్రల్లో మెరిశారు. జై దర్శకత్వం వహించిన ఈ సినిమాను బాహుబలి నిర్మాతలు ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మించడం విశేషం. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఆర్యన్, వాసంతి అనే నూతన దంపతులు రైల్వే కాలనీలోకి కొత్తగా కాపురానికి దిగుతారు. ఆర్యన్ తన భార్య వాసంతిని చాలా ప్రేమగా చూసుకుంటుంటాడు. ఇంటి, వంట పనులన్నీ అతను ఒక్కడే చేస్తుంటాడు. చుట్టుపక్కల వాళ్లకు ఇది ఒక వింతలా అనిపిస్తుంటుంది. ఇంతలో రాజీవ్ కనకాల అక్కడకు వస్తాడు. ఆర్యన్ చేసే పనులను చూసి షాక్ అవుతాడు. అదే సమయంలో అతనిపై అనుమానం కలుగుతుంది. దీంతో ఆర్యన్- వాసంతిల జీవితం గురించి తెలుసుకోవాలనుకుంటాడు.
ఈ క్రమంలో ఆర్యన్ భార్య హెల్యూషినేషన్‌తో బాధ పడుతుందని తెలుసుకుని బాధపడతాడు రాజీవ్. మరోవైపు ఆర్యన్ గురించి సంచలన విషయాలు తెలుసుకుంటాడు. ఒక అమ్మాయి కోసం ఓ ప్లాన్ ప్రకారమే రైల్వే కాలనీకి ఆర్యన్ వచ్చాడని రాజీవ్ కనుగొంటాడు. అంతేకాదు వాసంతిని అడ్డుతొలగించుకోవాలని పక్కా ప్లాన్ వేస్తున్నట్లు తెలుసుకుంటాడు. మరి ఆర్యన్ తన భార్యను అడ్గు తొలగించుకున్నాడా? వాసంతి తన భర్త నిజ స్వరూపం తెలుసుకుందా? అసలు రాజీవ్ కనకాల ఏం చేశాడు? అన్నది తెలుసుకోవాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూడాల్సిందే.
కేవలం 38 నిమిషాల రన్ టైమ్ తో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ’10/G రైల్వే క్వార్టర్స్’ . లవ్, థ్రిల్, సస్పెన్స్ అంశాలతో ఓ కాలనీలో జరిగే స్టోరీని అది కూడా కేవలం 38 నిమిషాల్లో అద్భుతంగా చూపించారు మేకర్స్. ప్రజెంట్ ఓటీటీ ట్రెండింగ్ లో ఉన్న ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూసేవారికి ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
10/G Railway Quarters
A lie that calls her madness.
A truth that refuses to stay hidden. 🔥From #KathaSudha
Streaming now, only on @etvwin 🎬 pic.twitter.com/PqSK1TKBLi
— ETV Win (@etvwin) March 15, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.