ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా సాధించిన విజయం గురించి చెప్పక్కర్లేదు. పాన్ ఇండియా లెవల్లోనే కాదు..ప్రపంచదేశాల్లోనూ సత్తా చాటింది. ఈ సినిమాతో స్టైలీష్ స్టార్ క్రేజ్ మారిపోయింది. అంతేకాకుండా ఈచిత్రంలో నటించిన పలువురు నటీనటులకు కూడా ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా పుష్ప రాజ్ స్నేహితుడు కేశవకు వచ్చిన ఇమేజ్ గురించి తెలిసిందే. ఈ సినిమాతో జగదీశ్ తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం అతను ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం సత్తిగాని రెండు ఎకరాలు. అమ్ముతాడా? సస్తడా? అనేది ఉపశీర్షిక. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
ఈ సినిమాను కొల్లూరు బ్యాక్ డ్రాప్లో రూపొందిస్తున్నారు. ఇందులో వెన్నలె కిశోర్ సహా పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఆహాలో మార్చి 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. మంచి కామెడీ సినిమా కోసం ఎదురుచూస్తున్నవాళ్లకు ఇది బెస్ట్ మూవీ అని తెలుస్తోంది.
ఇప్పటివరకు భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్… మొదటిసారి ఓటీటీలో నిర్మిస్తోన్న చిత్రం సత్తిగాని రెండు ఎకరాలు. ఇదిలా ఉంటే.. కొద్ది రోజులుగా పుష్ప 2 చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఇందులో రష్మిక మందన్నా, ఫహద్ ఫాజిల్, జగదీశ్ కీలకపాత్రలలో నటీస్తున్నారు.
ఉన్నవే రెండు ఎకరాలు. అమ్మకపోతే గడవదు, అమ్మితే మింగుడుపడదు.
సత్తి గాని రెండు ఎకరాలు. మార్చ్ 17 నుండి. మన ఆహా లో చుడండి.#SGREOnAHA Streaming from March 17 on @ahavideoin @OG_Jagadeesh @vennelakishore @_mohanasree @DamaAneesha @RajTirandasu @BithiriSathiV6 @abhinavdanda pic.twitter.com/e7PtyLCen5— Mythri Movie Makers (@MythriOfficial) March 5, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.