ఇటీవల రిలీజై.. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న థ్రిల్లర్ చిత్రం “ప్లే బ్యాక్”. దినేశ్ తేజ్, వకీల్ సాబ్ ఫేమ్ అనన్య నాగళ్ల, టి.ఎన్.ఆర్ ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సినిమా మే 21న ఆహా ఓటీటీలో అందుబాటులోకి రానుంది. రెండేళ్లుగా విడుదల కోసం నానా ఇబ్బందులు పడిన ఈ సినిమా ఎట్టకేలకు మార్ 5 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
జక్కా హరి ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే3న రిలీజై మంచి విజయాన్ని సాధించింది. టైమ్ ట్రావెల్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా.. రెండు వేర్వేరు కాలాలకు చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య సాగుతుంది. 2019లో క్రైమ్ రిపోర్టర్‌కి 1993సంవత్సరంలోని సుజాత అనే అమ్మాయికి మధ్య ఈ కథ సాగుతూ.. ఆధ్యాంతం అందర్నీ ఆకట్టుకుంటుంది.ఒక టెలిఫోన్‌ను వేదికగా ఉపయోగించి రెండు వేర్వేరు కాల వ్యవధులను పరస్పరం అనుసంధానించే భావన చాలా బాగుంది. దీనికి సంబంధించిన సన్నివేశాలు ఫస్టాఫ్‌లో బాగా అమలుచేయబడ్డాయి.చిన్న బడ్జెట్ సినిమా అయినప్పటికి నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక ఇటీవల కరోనాతో చనిపోయిన ప్రముఖ జర్నలిస్టు టీఎన్‌ఆర్.. ఈ సినిమాలో ఓ వైవిధ్యమైన పాత్ర పోషించి అందరి మన్ననలను పొందారు. ఈ సినిమాను ప్రసాద్ రావు పెద్దినేని నిర్మించగా కమ్రాన్ సంగీతం అందించారు.
మరిన్ని ఇక్కడ చదవండి :