
ఈ మధ్యకాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా కంటెంట్ బాగున్న సినిమాలు భారీవిజయాన్ని అందుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా గట్టిగానే రాబడుతున్నాయి. ఇక హరర్ థిల్లర్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలు ఈ మధ్య కాలంలో బాగా క్లిక్ అవుతున్నాయి. అలాంటి సినిమాల్లో పిండం సినిమా ఒకటి. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి హారర్ బ్యాక్ డ్రాప్ లో నిర్మించిన ఈ సినిమాకు సాయికిరణ్ దర్శకత్వం వహించాడు. శ్రీరామ్, ఖుషి రవి, ఈశ్వరీరావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా డిసెంబర్ 15 ప్రేక్షకుల కుందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. హారర్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది.
ఈ సినిమా కథ ఏంటంటే..ఆంథోని(శ్రీరామ్) ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్ గా పని చేస్తుంటాడు.. అతని భార్య మేరి(ఖుషి రవి), ఇద్దరు కూతుళ్లు(సోఫియా, తార), తల్లి సూరమ్మతో కలిసి శుక్లాపేటలోని ఓ ఇంట్లో ఉంటాడు. అయితే అది ఓ పురాతమైన ఇల్లు. తక్కువ ధరకు వస్తుందని భావించి ఆ ఇంటిని కొనుగోలు చేస్తాడు ఆంథోని. అయితే ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత వారికి ఊహించని సంఘటనలు ఎదురైతాయి. ఆంథోని చిన్న కూతురిలోకి ఓ ఆత్మ ఆవహిస్తుంది. కడుపుతో ఉన్న అతని భార్య హాస్పటల్‌లో చేరుతుంది. అదే సమయంలో వారికి సాయం చేయడానికి అన్నమ్మ (ఈశ్వరీరావు) రంగంలోకి దిగుతుంది. అయితే ఆ ఇంట్లో చాలా ఆత్మలు ఉన్నాయని తెలుసుకుంటారు. అయితే అసలు ఆత్మలు అక్కడ ఎందుకు ఉన్నాయి.. వారంతా ఎలా చనిపోయారు.? అన్నది ఆసక్తికరంగా ఉంటుంది.
ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. జనవరి మొదటి వారంలో పిండం సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో పిండం సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారని తెలుస్తోంది. మరి ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..