
ఆస్కార్ అవార్డుల సందడి మళ్లీ మొదలైంది. రెండేళ్ళ కింద ట్రిపుల్ ఆర్ పుణ్యమా అని ఆస్కార్ అవార్డులపై ఇండియాలో కూడా క్రేజ్ పెరిగింది. 2026 రేసులో మాత్రం ఓ ఇండియన్ సినిమా ముందడుగేసింది. ఇండియా నుంచి హోమ్ బౌండ్ ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్ అయింది. నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రతిష్ఠాత్మక 98వ అకాడమీ అవార్డుల రేసులో నిలిచింది. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఈ సినిమాను షార్ట్‌లిస్ట్ చేసినట్లు అకాడమీ ప్రకటించింది. కరణ్ జోహార్ సైతం ఇది పోస్ట్ చేసారు. 98వ అకాడమీ అవార్డుల కోసం మొత్తం 12 విభాగాల్లో ఎంపికైన చిత్రాల జాబితాను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ విడుదల చేసింది. ఆస్కార్ తుది నామినేషన్లను 2026 జనవరి 22న ప్రకటించనుండగా.. మార్చి 15న అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. కాగా సంక్రాంతికి వస్తున్నాం, కుబేరా, పుష్ప 2, గాంధీతాత చెట్టు, కన్నప్ప లాంటి సినిమాలు ఆస్కార్ కోసం పోటీ పడి రేసు నుంచి తప్పుకున్నాయి.
హోమ్ బౌండ్ సినిమా కథ విషయానికి వస్తే.. COVID-19 లాక్‌డౌన్ సమయంలో తమ సొంత గ్రామాలకు తిరిగి వెళ్లడానికి ప్రయత్నించే ఇద్దరు నిరుపేద ఉత్తర భారతీయ స్నేహితుల చందన్ (దళితుడు), షోయిబ్ (ముస్లిం) హృదయ విదారక కథ ఇది. సామాజిక అసమానతలు, కుల వివక్ష, పేదరికం, ఆకస్మికంగా ఉద్యోగాలు కోల్పోవడం వల్ల కలిగే కష్టాలను ఇందులో చూపించారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ హార్ట్ టచింగ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్టిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ అందుబాటులో లేదు కానీ హిందీలో ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ఈ మూవీని చూడొచ్చు.
Homebound is officially shortlisted for Best International Feature Film at the 98th Academy Awards😭❤️😭❤️ pic.twitter.com/OAoia77Q3h
— Netflix India (@NetflixIndia) December 17, 2025
Homebound, another film about India’s poverty and pain makes it to the Oscars! Good to know we’re still the Academy’s favorite case study in suffering. Juries love us most when we’re barefoot, broken, and bathed in tragedy. pic.twitter.com/oTEPvhpYBO
— Wokeflix (@wokeflix) December 17, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.