ప్రజంట్ ఓటీటీ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. కోవిడ్ సమయంలో జనాలు బాగా వెబ్ సిరీస్‌లు, మూవీస్ చూసేశారు. వివిధ ఫ్లాట్‌పాట్స్‌లో ఉన్న వరల్డ్ సినిమా కంటెంట్ మొత్తం చూసేశారు. ఆ అలవాటు అలాగే కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ కూడా చాలామంది థియేటర్స్ కంటే.. ఓటీటీలకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, సోని లివ్, ఆహా, హాట్ స్టార్, జీ5, సన్ నెక్ట్స్ వంటి ఫ్లాట్ ఫామ్స్ విపరీతమైన కంటెంట్ అందిస్తున్నాయి. రకరకాల సిరీస్‌లతో మూవీ లవర్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నాయి. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్ ఇంటర్నేషనల్ స్థాయి కంటెంట్‌ను తమ యూజర్లకు అందజేస్తుంది. అందుకు తగ్గట్లుగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్రిప్షన్ రేటు కూడా అధికమే.
అయితే ఒకరు సబ్‌స్రిప్షన్ తీసుకుని.. వారి ఫ్రెండ్స్ లేదా బంధువులు ఎక్కువ డివైజ్‌లలో వీక్షించే ఆప్షన్‌ను వినియోగించుకుంటున్నారు. లేదంటే ఇద్దరు, ముగ్గురు ముందుగానే మనీ షేర్ చేసుకుని.. సబ్‌స్రిప్షన్ తీసుకుని వాడుకుంటున్నారు. సబ్‌స్క్రైబర్ల సంఖ్య తగ్గిపోవడానికి ఇదే మెయిన్ రీజన్ అని నెట్‌ఫ్లిక్స్ భావిస్తుంది. ఈ క్రమంలోనే పాస్‌వర్డ్ షేరింగ్ ఫీచర్‌ను తొలగించాలని ఆ సంస్థ భావిస్తుందట.
2023 నుంచి నెట్‌ఫ్లిక్స్ యూజర్స్.. తమ అకౌంట్స్ పాస్‌వర్డ్‌లను ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్‌తో షేర్ చేయడం వీలవ్వదని వాల్‌స్ట్రీట్ జర్నల్ వార్తా సంస్థ తన కథనంలో వెల్లడించింది. ఒకవేళ యూజర్.. తమ పాస్‌వర్డ్‌ను ఇతరులతో పంచుకోవాలంటే.. నెట్‌ఫ్లిక్స్‌కు అదనంగా కొంత డబ్బు చెల్లించాలట. కొత్త సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయాలని సంస్థ భావిస్తుందట. ఇక్కడ స్టన్నింగ్ న్యూస్ ఏంటంటే.. చిలీ, పెరూ, కోస్టారికా, లాటిన్ అమెరికా దేశాల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది నెట్‌ఫ్లిక్స్. అక్కడ పాస్‌వర్డ్ షేరింగ్‌కు 3 డాలర్లు అంటే దాదాపు 250 రూపాయలు వసూలు చేస్తుంది. అలా డబ్బు కట్టకుండా పాస్‌వర్డ్ షేర్ చేయాలనుకుంటే.. డివైజ్ ఐడీ, అకౌంట్ యాక్టివిటీ, ఐపీ అడ్రస్ ద్వారా వారికి అడ్డుకట్ట వేస్తుంది. సబ్‌స్క్రైబర్ల సంఖ్యను పెంచుకునేందుకు నెట్‌ఫ్లిక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.