Hi Nanna: ఇట్స్ అఫీషియల్.. ఆ ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘హాయ్ నాన్న’.. స్ట్రీమింగ్ ఆరోజు నుంచే..

|

Dec 30, 2023 | 12:30 PM

తండ్రికూతురు బంధం.. అందమైన ప్రేమకథతో అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాకు అన్ని వర్గాల అడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే తండ్రి పాత్రలో మరోసారి ఆకట్టుకున్నాడు నాని. ఇందులో న్యాచురల్ స్టార్ కూతురిగా కియారా ఖన్నా నటించింది. అటు కంటెంట్ పరంగానే కాకుండా ఇటు మ్యూజిక్.. డైరెక్షన్‏తోనూ సినిమా హిట్ అయ్యిందనే చెప్పాలి. థియేటర్లలో సక్సెస్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది.

Hi Nanna: ఇట్స్ అఫీషియల్.. ఆ ఓటీటీలోకి వచ్చేస్తోన్న హాయ్ నాన్న.. స్ట్రీమింగ్ ఆరోజు నుంచే..
Hi Nanna Movie OTT
Follow us on

న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటేస్ట్ సూపర్ హిట్ మూవీ హాయ్ నాన్న. డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీలో సీతారామం బ్యూటీ మృణాల్ కథానాయికగా నటించింది. డిసెంబర్ 7న విడుదలైన ఈ సినిమా విజయాన్ని అందుకుంది. తండ్రికూతురు బంధం.. అందమైన ప్రేమకథతో అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాకు అన్ని వర్గాల అడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే తండ్రి పాత్రలో మరోసారి ఆకట్టుకున్నాడు నాని. ఇందులో న్యాచురల్ స్టార్ కూతురిగా కియారా ఖన్నా నటించింది. అటు కంటెంట్ పరంగానే కాకుండా ఇటు మ్యూజిక్.. డైరెక్షన్‏తోనూ సినిమా హిట్ అయ్యిందనే చెప్పాలి. థియేటర్లలో సక్సెస్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. విడుదలైన నెల రోజుల కంటే ముందే డిజిటల్ ప్లాట్ ఫామ్ పై అడియన్స్ ముందుకు రాబోతుంది ఈ సూపర్ హిట్ మూవీ. తాజాగా శనివారం ఉదయం ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ గురించి అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్.

హాయ్ నాన్న సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందట. వచ్చే ఏడాది జనవరి 4 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. తెలుగుతోపాటు.. హిందీ, మలయాళం, కన్నడ, తమిళం భాషలలో ఈ సినిమా అందుబాటులో ఉంటుంది.  “మీతో ఎప్పుడూ ఉండిపోవడానికి వచ్చేశారు యష్న (మృణాల్ ఠాకూర), మహీ (కియారా ఖన్నా), విరాజ్ (నాని). హాయ్ నాన్న సినిమా నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో జనవరి 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది” అంటూ ట్వీట్ చేసింది. ఇప్పటివరకు థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు ఇప్పుడు నేరుగా ఇంట్లోనే చూసేయ్యోచ్చు.

హాయ్ నాన్న థియేటర్లలో విడుదలై ఇంకా నెల రోజులు పూర్తి కాలేదు. నిజానికి ఈ సినిమా జనవరి 17న ఓటీటీలోకి వస్తుందని ప్రచారం నడిచింది. కానీ అనుకున్న సమయానికి కంటే ముందే ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకువస్తున్నారు మేకర్స్.ఈ సినిమాలో నాని, మృణాల్ జోడి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే ఎమోషనల్ కంటెంట్ తో అడియన్స్ హృదయాలను టచ్ చేయడంలో డైరెక్టర్ శౌర్యువ్ సక్సెస్ అయ్యాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.