ఆహా అందిస్తోన్న సూపర్ హిట్ మూవీస్ , గేమ్ షోస్, టాక్ షోస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వంద శాతం తెలుగు కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తోంది ఆహా. ఈ క్రమంలోనే ప్రతిభకు పట్టం కడుతూ ఇండియన్ ఐడల్ కార్యక్రమంతో ఎంతో మంది సింగర్స్ ను పరిచయం చేస్తోంది. ఇప్పటికే మొదటి సీజన్‌లో శ్రీ రామ్ చంద్ర హోస్ట్‌గా వ్యవహరించగా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నిత్యామీనన్, సింగర్ కార్తీక్ జడ్జ్ లుగా వ్యవహరించారు. ఇక ఇప్పుడు సీజన్ 2 కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఎంతో మంది ప్రతిభావంతులైన సింగర్స్ ఈ ఆడిషన్ లో పాల్గొన్నారు. ఇక త్వరలోనే తెలుగు ఇండియన్ కాంపిటేషన్ గ్రాండ్ గా ప్రారంభం కానుంది. కాగా ఈ సీజన్ 2 కోసం ఎంపిక అయిన సింగర్స్ ను పరిచయం చేస్తూ ఓ స్పెషల్ ఎపిసోడ్ ను ప్లాన్ చేసింది ఆహా. ఈ ఎపిసోడ్ కు గల విత్ బాల అనే ట్యాగ్ ఇచ్చారు.
తాజాగా ఇందుకు సంబందించినాప్రోమోను విడుదల చేసింది. ఈ ఎపిసోడ్ లో సందడంతా బాలయ్యదే. సూపర్ స్టైలిష్ కాస్ట్యూమ్ లో నటసింహం అదరగొట్టారు. అలాగే ఈ ఎపిసోడ్ కోసం బాలకృష్ణ గొంతు కూడా సవరించారు. ఇండియన్ ఐడల్ సీజన్ 2 కోసం ఎంపిక అయిన12 మందిని బాలకృష్ణ పరిచయం చేయనున్నారు.
ఈ ఎపిసోడ్ ను మార్చ్ 17, 18న స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇక సీజన్ 2 కు హోస్ట్ గా హేమ చంద్ర హోస్ట్ గా వ్యవహరించనున్నారు. అలాగే తమన్ , సింగర్ గీతామాధురి, సింగర్ కార్తీక్ జడ్జ్ లుగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం బాలయ్య ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.