AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: పోలీసులకు క్లూ ఇచ్చి మరీ హత్యలు చేసే సైకో.. ఓటీటీలో మతిపోగొట్టే క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..

ఇతర సినిమాలతో పోల్చుకుంటే సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఓటీటీలో ఈ రకమైన సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. మరి మీరు కూడా ఓటీటీలో ఓ మంచి ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చూడాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే.

OTT Movie: పోలీసులకు క్లూ ఇచ్చి మరీ హత్యలు చేసే సైకో.. ఓటీటీలో మతిపోగొట్టే క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..
OTT Movie
Basha Shek
|

Updated on: Jun 09, 2026 | 2:45 PM

Share

ఓటీటీలో అన్నిరకాల కంటెంట్ అందుబాటులో ఉంటుంది. లవ్, యాక్షన్ ,కామెడీ, ఫ్యామిలీ, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్, హారర్.. ఇలా అన్ని జానర్లకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లను చూడవచ్చు. అయితే ఇప్పుడు ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలదే హవా అని చెప్పుకోవచ్చు. ఇందులో ఉండే ఊహించని ట్విస్టులు, టర్న్ లు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ ఇస్తుంటాయి. అందుకే ఇలాంటి సినిమాలకు ఓటీటీలో మంచి వ్యూయర్ షిప్ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా ఒక ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీసే. ఒక సైకో కిల్లర్‌కు, సాధారణ పోలీస్ కు మధ్య జరిగే మైండ్ గేమ్ నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది. కథ విషయానికి వస్తే.. విక్టర్ సెల్లదురై ఒక డేరింగ్ అండ్ డ్యాషింగ్ ఆఫీసర్. అలాంటిది అతని భార్య ఉన్నట్లుండి కనిపించకుండా పోతుంది. మరోవైపు నగరంలో వరుసగా దారుణ హత్యలు జరుగుతాయి. పైగా ప్రతి మర్డర్ లో ఒక హింట్ వదిలేసి పోలీసులకు సవాల్ విసురుతాడు. దీంతో ఈ హత్యలన్నీ ఒక సైకో కిల్లర్ చేస్తున్నాడని పోలీసులు నిర్ధరణకు వస్తారు. ఈ సీరియల్ మర్డర్స్ కేసుని ఇన్వెస్టిగేట్ చేసేందుకు విక్టర్ రంగంలోకి దిగుతాడు. దీంతో కిల్లర్ మరింత అలెర్ట్ అవుతడు. తన దైన జిమ్మిక్కులతో పోలీసులను తప్పుదారి పట్టిస్తాడు.

మరి అసలు ఆ సైకో కిల్లర్ ఎవరు? అతని గతం ఏమిటి? ఎందుకీ హత్యలు చేస్తున్నాడు? పోలీసులు ఆ సైకో క్రిమినల్ ను ఎలా పట్టుకున్నారు? విక్టర్ భార్య ఏమైపోయింది? అన్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే. ఆద్యంతం ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠ రేపే సన్నివేశాలు, ఊహించని ట్విస్టులతో సాగే ఈ ఇంటెన్స్ క్రైమ్ సిరీస్ పేరు ఇరు ధ్రువం. ఎం. కుమరన్ ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎ సైన్ ఆఫ్ లైఫ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సమీర్ నాయర్ ప్రమోద్ చెరువులత్ సంయుక్తంగా ఈ సిరీస్ ను నిర్మించారు. నంద దురైరాజ్, ప్రసన్న, అబ్దుల్, సెబాస్టిన్ ఆంటోనీ, అభిరామి వెంకటాచలం తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్ లో మొత్తం 9 ఎపిసోడ్స్ ఉన్నాయి. అన్నీ ఏ మాత్రం బోర్ కొట్టకుండా ఆద్యంతం థ్రిల్లింగ్ గా సాగుతాయి. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ సోని లివ్ లో అందుబాటులో ఉంది.

ఓటీటీలో మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా/ వెబ్ సిరీస్ చూడాలనకునేవారికి ఇరు ధ్రువం మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కామన్వెల్త్ విజేతలతో ప్రధాని మోదీ సందడి..
కామన్వెల్త్ విజేతలతో ప్రధాని మోదీ సందడి..
పవర్ ఫుల్ గౌరీ హెగ్డేగా టబు.. స్లమ్ డాగ్ గ్లింప్స్ రిలీజ్..
పవర్ ఫుల్ గౌరీ హెగ్డేగా టబు.. స్లమ్ డాగ్ గ్లింప్స్ రిలీజ్..
కేవలం 30 నిమిషాల్లో కరకరలాడే జిలేబీ.. ఇంట్లో ఎలా చేయాలో తెలుసా?
కేవలం 30 నిమిషాల్లో కరకరలాడే జిలేబీ.. ఇంట్లో ఎలా చేయాలో తెలుసా?
స్వామి భద్రేశ్‌దాస్‌కు ‘వేదాంతవిద్యా విశ్వగురు’ గౌరవం
స్వామి భద్రేశ్‌దాస్‌కు ‘వేదాంతవిద్యా విశ్వగురు’ గౌరవం
10 ఏళ్లుగా ఎవ్వరూ టచ్ చేయలే.. ఏకైక భారత ఆటగాడిగా భారీ రికార్డ్..!
10 ఏళ్లుగా ఎవ్వరూ టచ్ చేయలే.. ఏకైక భారత ఆటగాడిగా భారీ రికార్డ్..!
ఊర కుక్కలు వర్సెస్ నీటి కుక్కలు.. పోరులో గెలుపు ఎవరిది..?
ఊర కుక్కలు వర్సెస్ నీటి కుక్కలు.. పోరులో గెలుపు ఎవరిది..?
గుంటూరు స్పెషల్ కాకరకాయ కారం.. ఇలా చేసి ఒక్కసారి తింటే ఇక వదలరు!
గుంటూరు స్పెషల్ కాకరకాయ కారం.. ఇలా చేసి ఒక్కసారి తింటే ఇక వదలరు!
అర్ధరాత్రి ఆర్టీసీ బస్సులో భారీ నగదుతోపాటు ల్యాప్‌టాప్ ప్రత్యక్షం
అర్ధరాత్రి ఆర్టీసీ బస్సులో భారీ నగదుతోపాటు ల్యాప్‌టాప్ ప్రత్యక్షం
పోలీస్ స్టేషన్ లో మనోజ్ రచ్చ.. సారీ చెప్పాలంటూ డిమాండ్..
పోలీస్ స్టేషన్ లో మనోజ్ రచ్చ.. సారీ చెప్పాలంటూ డిమాండ్..
జస్ట్‌ 45 మినెట్స్.. హైదరాబాద్‌ టూ విజయవాడ.. ఎగిరి గంతేసే న్యూస్
జస్ట్‌ 45 మినెట్స్.. హైదరాబాద్‌ టూ విజయవాడ.. ఎగిరి గంతేసే న్యూస్