AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT: ఓటీటీలో దూసుకుపోతున్న హారర్ థ్రిల్లర్.. ఒక్కసారి చూస్తే వదలలేరు.. ఎక్కడ చూడొచ్చంటే

ఓటీటీల పుణ్యమా అని ఆడియన్స్ కు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. వీకెండ్ వస్తే చాలు ఆడియన్స్ అందరూ ఓటీటీలతో బిజీ అవుతున్నారు. ఫ్యామిలీ మొత్తం కలిసి ఇంట్లో కూర్చొని ఓటీటీల్లో సినిమాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఓటీటీ లవర్స్ ను ఆకట్టుకునేలా వారానికి పదుల సంఖ్యలో సినిమాలు విడుదలై మెప్పిస్తున్నాయి.

OTT: ఓటీటీలో దూసుకుపోతున్న హారర్ థ్రిల్లర్.. ఒక్కసారి చూస్తే వదలలేరు.. ఎక్కడ చూడొచ్చంటే
Ott
Rajeev Rayala
|

Updated on: Oct 17, 2026 | 5:21 PM

Share

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత సినీ ప్రేక్షకులకు వినోదం మరింత చేరువైంది. థియేటర్లలో విడుదలయ్యే సినిమాల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా, ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి నచ్చిన చిత్రాలను వీక్షిస్తున్నారు. ముఖ్యంగా వీకెండ్ వచ్చిందంటే చాలు.. కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌ల కోసం ఓటీటీలను తెగ వెతికేస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్లు, హారర్ కథలు, మిస్టరీ సినిమాలకు డిజిటల్ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో హారర్, ఫాంటసీ, మిస్టరీ అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఓ తెలుగు సినిమా మరోసారి సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. అదే ఆది సాయికుమార్ నటించిన శంభాల. టాలీవుడ్ నటుడు ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన శంభాల చిత్రం హారర్ ఫాంటసీ, మిస్టికల్ థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కింది. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అర్చనా అయ్యర్ కథానాయికగా నటించింది. స్వసిక, మధునందన్, రవివర్మ, రామరాజు, హర్షవర్ధన్, అన్నపూర్ణ, లక్ష్మణ్ మీసాల, ఇంద్రనీల్ వర్మ, ప్రవీణ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

సాధారణ హారర్ సినిమాలకు భిన్నంగా.. ఉల్కాపాతం, అంతుచిక్కని సంఘటనలు, మూఢనమ్మకాలు, శాస్త్రీయ ఆలోచనల చుట్టూ కథను నడిపించడం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కథలో ఒక్కో విషయం బయటపడుతున్న కొద్దీ అసలు ఏం జరుగుతోందనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరుగుతుంది. ఈ సినిమా కథ 1980వ దశకం నేపథ్యంలో సాగుతుంది. శంభాల అనే ఓ గ్రామంలో ఆకాశం నుంచి ఒక ఉల్క వచ్చి పడుతుంది. ఆ ఘటన తర్వాత గ్రామంలో అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి. వింత సంఘటనలు, భయానక అనుభవాలు గ్రామస్థులను ఆందోళనకు గురిచేస్తాయి. వరుసగా చోటుచేసుకునే మరణాలతో గ్రామంలో భయాందోళనలు నెలకొంటాయి.

ఆకాశం నుంచి పడిన ఉల్క వల్లే గ్రామానికి అరిష్టం వచ్చిందని, ఏదో దుష్టశక్తి తమను వెంటాడుతోందని స్థానికులు నమ్ముతారు. ఈ పరిణామాల వెనుక ఉన్న అసలు కారణాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నంలోకి కథానాయకుడు అడుగుపెడతాడు. సైన్స్ ను నమ్మే ఆలోచించే ఓ వ్యక్తిగా ఆది సాయికుమార్ ఈ సినిమాలో కనిపిస్తాడు. గ్రామంలో జరుగుతున్న సంఘటనల వెనుక రహస్యాన్ని ఛేదించే క్రమంలో అతడికి దేవి పాత్రలో నటించిన అర్చనా అయ్యర్ ఎలా సహాయపడింది.? ఆ ఉల్కకు, గ్రామంలో జరుగుతున్న వింత పరిణామాలకు మధ్య సంబంధం ఏమిటి.? అక్కడి ప్రజలను భయపెడుతున్న అసలు రహస్యం ఏంటి.? అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఆసక్తికరంగా సాగుతాయి. ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, రహస్యాలతో నిండిన కథనం హారర్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఆసక్తికరమైన అనుభూతిని అందిస్తాయి. ఈ సినిమా ప్రస్తుతం జీ5  ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us