AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: అపార్ట్‌మెంట్లో వరుసగా అమ్మాయిల హత్యలు.. ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

ఓటీటీలో మంచి ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా కానీ వెబ్ సిరీస్ కానీ చూడాలనుకుంటున్నారా? అయితే మీకు ఈ మూవీ ఒక బెస్ట్ ఛాయిస్. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ సినిమాలో ఊహించని ట్విస్టులు, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.

OTT Movie: అపార్ట్‌మెంట్లో వరుసగా అమ్మాయిల హత్యలు.. ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT Movie
Basha Shek
|

Updated on: Jul 23, 2026 | 9:13 PM

Share

ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇతర సినిమాలతో పోలిస్తే వీటిలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కాస్త ఎక్కువగానే ఉంటాయి. అందుకే ఆడియెన్స్ ఈ జానర్ సినిమాలను తెగ చూసేస్తుంటారు. ముఖ్యంగా ఓటీటీల్లో క్రైమ్ జానర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆడియెన్స్ అభిరుచికి తగ్గట్టుగానే పలు ఓటీటీ సంస్థలు కూడా ఇతర భాషల్లో హిట్ అయిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను తెలుగుతో పాటు ఆయా భాషల్లోకి అనువాదం చేసి స్ట్రీమింగ్ కు తీసుకొస్తుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమానే. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలై ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. బుక్ మై షోతో పాటు ఐఎమ్ డీబీలోనూ ఈ సినిమాకు మంచి రేటింగ్ దక్కడం విశేషం. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. చెన్నై యురపాక్కంలో ఉన్న S.I.S. అపార్ట్‌మెంట్ లో ఈ కథంతా నడుస్తుంది. కొత్త సంవత్సరం వేడుకలు జరుగుతోన్న రోజు రాత్రి ఒక నాలుగేళ్ల చిన్నారి అకస్మాత్తుగా కనిపించకుండా పోతుంది. ఈ పాప మిస్సింగ్ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇన్‌స్పెక్టర్ రంగంలోకి దిగుతాడు. అతనితో పాటు ఏసీపీ కూడా ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఈ క్రమంలో అపార్ట్ మెంట్లో ఉన్న వారందరిని తమదైన శైలిలో విచారిస్తారు. ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగానే మరో అమ్మాయి స్విమ్మింగ్ పూల్‌లో మునిగి చనిపోతుంది. అలాగే అపార్ట్‌మెంట్‌లో ఉండే డాక్టర్ ప్రసన్న బిల్డింగ్ పైనుంచి పడి అనుమానాస్పదంగా మరణిస్తాడు.

మరి ఈ వరుస మరణాల వెనుక ఉన్నదెవరు? అసలు ఈ హత్యలు చేయాల్సిన ఉద్దేశం ఎవరికి ఉంది? పోలీసులు కిల్లర్స్ ను ఎలా పట్టుకున్నారు? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ పేరు కాళిదాస్ 2. ప్రేమిస్తే హీరో భరత్ ఇందులో ఇన్ స్పెక్టర్ గా ప్రధాన పాత్రను పోషించాడు. దర్శకుడు శ్రీ సెంథిల్ తెరకెక్కించిన తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో భరత్‌కు జోడీగా అబర్నతి, భవానీ, ప్రకాష్ రాజ్, కిషోర్, అజయ్ కార్తీ, సంగీత మాధవన్ నాయర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా పలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, సన్ నెక్ట్స్ , ఆహా, సింప్లీ సౌత్, టెంట్ కొట్టా, షార్ట్ ఫ్లిక్స్, లయన్స్‌గేట్ ప్లేలలో ఈ సినిమా అందుబాటులో ఉంది. అయితే వీటిలో కేవలం ఒక్క అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో మాత్రమే కాళిదాస్ 2 తెలుగు వెర్షన్ ను చూడవచ్చు.

కాళి దాసు 2 సినిమా ట్రైలర్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us