Mirzapur: ఒక్క యాక్సిడెంట్ జీవితాన్ని తారుమారు చేసింది.. దేశం తరపున ఆడాలకున్న కుర్రాడు హీరో అయ్యాడు..

|

Jul 13, 2024 | 1:32 PM

ఆరు సంవత్సరాల క్రితం సీజన్ 1 హిట్ కాగా.. ఇప్పుడు సీజన్ 3కి కూడా విమర్శకుల ప్రశంసలు వస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ ద్వారా విజయాన్ని అందుకున్న నటీనటులలో బాలీవుడ్ స్టార్ అలీ ఫజల్ ఒకరు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అలీ ఫజల్ మాట్లాడుతూ.. సీజన్ 3 ఇంత పెద్ద హిట్ అవుతుందని తాము అసలు ఊహించలేదని అన్నారు. అలాగే తాను నటుడిగా మారతానని ఎప్పుడూ అనుకోలేదని.. తన జీవితంలో జరిగిన ఓ ఘటనను బయటపెట్టారు.

Mirzapur: ఒక్క యాక్సిడెంట్ జీవితాన్ని తారుమారు చేసింది.. దేశం తరపున ఆడాలకున్న కుర్రాడు హీరో అయ్యాడు..
Ali Fazal
Follow us on

ప్రస్తుతం ఓటీటీలో విజయవంతంగా దూసుకుపోతున్న వెబ్ సిరీస్ మీర్జాపూర్ సీజన్ 3. గతంలో వచ్చిన సీజన్ 1, 2 సూపర్ హిట్ కాగా.. ఇప్పుడు మూడో సీజన్ సైతం మంచి రెస్పా్న్స్ అందుకుంటుంది. ఇక ఇందులో కనిపించిన నటీనటులకు గుర్తింపు కూడా వచ్చింది. ఇందులో అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి శర్మ, రసిక దుగల్ కీలకపాత్రలు పోషించారు. ఆరు సంవత్సరాల క్రితం సీజన్ 1 హిట్ కాగా.. ఇప్పుడు సీజన్ 3కి కూడా విమర్శకుల ప్రశంసలు వస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ ద్వారా విజయాన్ని అందుకున్న నటీనటులలో బాలీవుడ్ స్టార్ అలీ ఫజల్ ఒకరు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అలీ ఫజల్ మాట్లాడుతూ.. సీజన్ 3 ఇంత పెద్ద హిట్ అవుతుందని తాము అసలు ఊహించలేదని అన్నారు. అలాగే తాను నటుడిగా మారతానని ఎప్పుడూ అనుకోలేదని.. తన జీవితంలో జరిగిన ఓ ఘటనను బయటపెట్టారు.

ఇటీవల ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. “మీర్జాపూర్ సీజన్ 3 సూపర్ హిట్ అవుతుందని మేము అసలు ఊహించలేదు. నేనెప్పుడు జిమ్ లోకి వెళ్లలేదు. ఎందుకంటే నేను స్పోర్ట్స్ పర్సన్. కాబట్టి జిమ్ బాడీగా మారాలంటే చాలా చిరాకు వచ్చింది. చిన్నప్పటి నుంచి నేను బాస్కెట్ బాల్ ప్లేయర్ ను. దేశం తరుపున ఆడాలని ఎన్నో కలలు కన్నాను. స్కూల్ డేస్ లో నాకు ఒక ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో నా భుజానికి తీవ్ర గాయమైంది. కోలుకున్న తర్వాత తిరిగి బాస్కెట్ బాల్ ఆడేందుకు ప్రయత్నించాను. కానీ గాయం నొప్పి వేధించింది. దీంతో ఆటలకు దూరంగా ఉండాలని వైద్యులు చెప్పడంతో నటనవైపు అడుగులు వేశాను. ఆ సమయంలో నేను చాలా బాధపడ్డాను. నిద్రలేని రాత్రుళ్లు గడిపాను” అంటూ చెప్పుకొచ్చారు.

మీర్జాపూర్ సీజన్ 3 రిలీజ్ అయిన కొన్ని రోజులపాటు ఎలాంటి టాక్ లేదు. కానీ వారం రోజుల తర్వాత టాక్ మారిపోయింది. ఆనాటి నుంచి మేము వెనక్కి తిరిగి చూడలేదు. ఈ సీజన్ సూపర్ హిట్ అయ్యింది. పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి కంటెంట్ తో ఎన్నో సినిమాలు, షోలు వస్తున్నాయి. అందుకే ఇందులో నటించడానికి భయపడలేదని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.