Niharika Konidela: మరోసారి ఓటీటీలో సందడి చేయనున్న మెగా డాటర్‌.. అసలు ‘ఓసీఎఫ్‌ఎస్‌’ ఏంటో తెలియాలంటే..

|

Oct 29, 2021 | 5:34 AM

Niharika Konidela: 'ఒక మనసు' సినిమాతో సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చారు మెగా డాటర్‌ నిహారిక. ఒక రకంగా చెప్పాలంటే మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా మారిన తొలి ఉమెన్‌ నిహారిక అనే చెప్పడంలో ఎలాంటి..

Niharika Konidela: మరోసారి ఓటీటీలో సందడి చేయనున్న మెగా డాటర్‌.. అసలు ఓసీఎఫ్‌ఎస్‌ ఏంటో తెలియాలంటే..
Niharika Zee5
Follow us on

Niharika Konidela: ‘ఒక మనసు’ సినిమాతో సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చారు మెగా డాటర్‌ నిహారిక. ఒక రకంగా చెప్పాలంటే మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా మారిన తొలి ఉమెన్‌ నిహారిక అనే చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. అయితే నిహారిక వరుస సినిమాల్లో మాత్రం నటించలేరు. ఆచితూచి నిర్ణయం తీసుకుంటూ కేవలం కొన్ని సినిమాల్లో మాత్రమే తళుక్కుమన్నారు. అయితే చేసిన ప్రతీ సినిమాలో తనకంటూ ఓ ప్రత్యేకత ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు. ఇదే క్రమంలో సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటించి మెప్పించారు. ఈ క్రమంలోనే ‘ముద్దప్పు ఆవకాయ’, ‘నాన్న కూచి’ వంటి వెబ్‌ సిరీస్‌ల్లో నటించారు. ఇక 2019లో వచ్చిన సైరా నర్సింహరెడ్డి తర్వాత నిహారిక మళ్లీ వెండితెరపై కనిపించలేరు.

ఇదిలా ఉంటే ఈ మెగా డాటర్‌ తాజాగా జీ5 నిర్మిస్తోన్న ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై తాజాగా జీ5 ట్విట్టర్‌ వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. ‘OCFS’ హ్యాష్‌ట్యాగ్‌ను పోస్ట్ చేసి.. ‘దీని అర్థం ఏంటో మీరు గెస్‌ చేయలగరా.? నిహారిక మా ఎగ్జైట్‌మెంట్‌ అయితే పీక్స్‌ అసలు’ అంటూ ట్వీట్ చేసింది. దీంతో అసలు ఇది సినిమానా.? వెబ్‌ సిరీసా.? అన్న సందేహాలు మొదలయ్యాయి.

ఇక ఇదే ట్వీట్‌ను రీట్వీట్ చేసిన నిహారిక.. ‘#OCFS’ అంటే ఏంటో గెస్‌ చేయండి.. జీ5 తెలుగు నేను కూడా దీని గురించి చాలా ఆతృతగా ఉన్నాను. రేపు (శుక్రవారం) చాలా ప్రత్యేకమైన రోజు.. నాన్న పుట్టిన రోజు పుట్టిన రోజు సందర్భంగా ఈ కొత్త ప్రాజెక్ట్‌ను విడుదలచేస్తాము’అంటూ ట్వీట్ చేసింది. మరి నిహారిక కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించి క్లారిటీ రావాలంటే మరికొద్ది సేపు ఆగాల్సిందే.

Also Read: Superstar Rajinikanth: ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ రజనీకాంత్.. కారణమదేనంటున్న సన్నిహితులు..

ఆంధ్రప్రదేశ్‏లోని మారేడుమిల్లి అందాలను చూస్తే మైమరచిపోతారు..

ఆంధ్రప్రదేశ్‏లోని మారేడుమిల్లి అందాలను చూస్తే మైమరచిపోతారు..