Bhola Shankar: మెగాస్టార్‌ చిరంజీవి భోళా శంకర్‌ ఓటీటీ ఫిక్స్‌.. థియేట్రికల్‌ రిలీజుకు ముందే అధికారిక ప్రకటన

వాల్తేరు వీరయ్య తర్వాత భోళాశంకర్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు చిరంజీవి. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మహానటి కీర్తి సురేశ్‌ చిరు చెల్లెలిగా నటిస్తోంది.

Bhola Shankar: మెగాస్టార్‌ చిరంజీవి భోళా శంకర్‌ ఓటీటీ ఫిక్స్‌.. థియేట్రికల్‌ రిలీజుకు ముందే అధికారిక ప్రకటన
Bhola Shankar Movie

Updated on: Jan 14, 2023 | 4:57 PM

రీ ఎంట్రీలో యంగ్‌ హీరోలతో పోటీపడుతున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. గతేడాది ఆచార్య, గాడ్‌ఫాదర్‌లతో అలరించిన ఆయన ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్యగా ప్రేక్షకుల ముందుకువచ్చాడు. శుక్రవారం (జనవరి 13)న విడుదలైన ఈ చిత్రం సూపర్‌ హిట్ టాక్‌ తెచ్చుకుంది. దీంతో మెగా ఫ్యాన్స్‌కు సంక్రాంతి ఫెస్టివల్‌ ముందుగానే వచ్చింది. వింటేజ్‌ చిరును స్ర్కీన్‌పై చూశామని ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఇదిలా ఉంటే వాల్తేరు వీరయ్య తర్వాత భోళాశంకర్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు చిరంజీవి. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మహానటి కీర్తి సురేశ్‌ చిరు చెల్లెలిగా నటిస్తోంది. ఏప్రిల్ 14న ఈ మెగా మూవీని విడుదల చేయనున్నట్లు గతేడాది చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. అయితే భోళా శంకర్‌ ఓటీటీ పార్ట్‌నర్‌ అప్పుడే ఫిక్స్‌ చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ ఈ సినిమాను స్ట్రీమింగ్‌ చేయనుంది. దీనికి సంబంధించి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

సంక్రాంతి సందర్భంగా పలు సినిమాలు తమ ఓటీటీలోనే రిలీజ్ కాబోతున్నాయని ప్రకటించిన నెట్ ఫ్లిక్స్ భోళా శంకర్ పోస్టర్ ని కూడా షేర్ చేసింది. ఏప్రిల్‌ 14న థియేట్రికల్ రిలీజ్ తర్వాత తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళం భాషల్లో మెగా సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే హఠాత్తుగా ఈ పోస్టర్ చూసిన చాలామంది భోళాశంకర్‌ డైరెక్ట్ ఓటీటీలో వస్తుందేమోనని కంగారు పడ్డారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి రిలాక్స్‌ అయ్యారు. కాగా అజిత్‌ నటించిన కోలీవుడ్‌ హిట్‌ మూవీ వేదాళం రీమేక్‌గా భోళాశంకర్‌ తెరకెక్కనుంది. అన్నా చెల్లెళ్ల అనుబంధంతో పాటు మాస్‌ అంశాలను మేళవిస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నారు మెహర్‌ రమేశ్‌. ఏకే ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై అనిల్‌ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..