OTT Movie: ఓటీటీలో మంజూ వారియర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. పిల్లలతో మాత్రం అసలు చూడకండి

|

Mar 17, 2025 | 7:59 PM

ఓటీటీలో అన్ని రకాల కంటెంట్ సినిమాలు ఉంటాయి. అయితే ఆడియెన్స్ ఎక్కువగా హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలకే ఎక్కువ ఓటు వేస్తారు. ముఖ్యంగా మలయాళ సినిమాలకు ఈ మధ్యన బాగా డిమాండ్ ఎక్కువైంది. ఈ ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కూడా సరిగ్గా ఈ కోవకు చెందినదే.

OTT Movie: ఓటీటీలో మంజూ వారియర్  సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. పిల్లలతో మాత్రం అసలు చూడకండి
OTT Movie
Follow us on

కోలీవుడ్ సీనియర్ హీరోయిన్ మంజూ వారియర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 40వ పడిలో పడినా ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చే అందం ఆమెది. గతేడాది రజనీకాంత్ తో కలిసి వేట్టయాన్ సినిమాలో సందడి చేసిందీ అందాల తార. తాజాగా మంజూ వారియర్ నటించిన ఓ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అదే మలయాళ సినిమా ఫుటేజ్. మంజు వారియ‌ర్‌తో పాటు విశాఖ్ నాయ‌ర్‌, గాయ‌త్రి అశోక్ తదితరులు ఈ మూవీలో కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ ముగ్గురి పాత్ర‌తోనే ఈ సినిమా క‌థ‌ మొత్తం సాగుతుంది. బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్, అదే నండి మహారాజా విలన్ ఈ సినిమాకు ప్రజెంటర్ గా వ్యవహరించడం విశేషం.
ఇక అన్వేషిప్పిన్ కండేతుమ్‌, అంజ‌మ్ పాథిరా, అండ్రాయిడ్ కుంజ‌ప్ప‌న్‌ తదితర మలయాళ సూపర్ హిట్ సినిమాలకు ఎడిటర్ గా పనిచేసిన సైజు శ్రీధ‌ర‌న్ ఈ మూవీని తెరకెక్కించాడు. డైరెక్టర్ గా ఇదే అతనికి మొదట సినిమా. గత ఏడాది అగస్టు 23న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. కథా, కథనాలు ఆసక్తికరంగా ఉండడం, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉండడంతో ఫుటేజ్ మూవీ మాలీవుడ్ ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకుంది. అదే సమయంలో విశాఖ్‌, గాయ‌త్రి ల మధ్య బోల్డ్, లిప్‌లాక్ సీన్స్ ఎక్కువ‌గా ఉండ‌టంపై విమర్శలు వచ్చాయి. థియేటర్లలో బాగా ఆడిన ఈ సినిమా అక్టోబ‌ర్ 18న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీలివ్ లోకి వచ్చింది. ఇప్పటికీ మూవీ ట్రెండ్ అవుతూనే ఉండడం విశేషం.

 

 

ఇవి కూడా చదవండి

ఫుటేజ్ సినిమా కథేంటంటే..

ఫుటేజ్ సినిమా కథ విషయానికి వస్తే.. పేరుకు తగ్గట్టుగానే ఈ సినిమా మొత్తం వీడియో రికార్డింగ్ ఫార్మాట్ లో సాగుతుంది. కథ కూడా కొత్తగా ఉంటుంది. లాక్ డౌన్ కారణంగా అందరూ ఇంట్లోనే ఉండిపోతారు. అదే క్రమంలో యూట్యూబర్లైన విశాఖ్‌, గాయ‌త్రి లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంటారు. వీరున్న అపార్ట్ మెంట్లోనే ఒక మహిళ ఒంటరిగా ఉంటుంది. దీంతో ఆ మహిళ గురించి తమ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ ప్రపంచానికి తెలియచేయాలని విశాఖ్‌, గాయ‌త్రి అనుకుంటారు. అదే సమయంలో వారికి అనుకోని పరిణామాలు ఎదురవుతాయి? మరి ఆ ఫ్లాట్ నుంచి వారు ప్రాణాలతో బయటపడ్డారా? లేదా? అన్నదే ఫుటేజ్ మూవీ కథ. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, కాస్త బోల్డ్ సీన్స్ ఉన్నాయి కాబట్టి పిల్లలతో చూడకపోవడమే బెటర్.

ఫుటేజ్ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి