OTT Movie: ప్రెగ్నెంట్ లేడీసే టార్గెట్.. ఓటీటీని షేక్ చేస్తోన్న హారర్ థ్రిల్లర్.. ఐఎమ్‌డీబీలో 9.2 రేటింగ్ 

గత వారం ఓటీటీలోకి వచ్చిన ఈ ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్ మూవీ అదరగొడుతోంది. ఆసక్తికరమైన కథా కథనాలు, భయపెట్టే సీన్స్, అద్దిరిపోయే ట్విస్టులతో ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తోంది. ఇప్పుడీ సినిమా ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతుండడం విశేషం.

OTT Movie: ప్రెగ్నెంట్ లేడీసే టార్గెట్.. ఓటీటీని షేక్ చేస్తోన్న హారర్ థ్రిల్లర్.. ఐఎమ్‌డీబీలో 9.2 రేటింగ్ 
L Movie IN OTT

Updated on: Dec 01, 2025 | 7:57 PM

గత వారం పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన డబ్బింగ్ సినిమాలు, సిరీస్ లు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. అలా గత వారం ఓటీటీకి వచ్చిన ఓ హారర్ థ్రిల్లర్ ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంటోది. గతేడాది ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాగా ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తెరకెక్కిన ఈ మూవీ కి మంచి కలెక్షన్లు వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు నోచుకోలేదు. సుమారు ఏడాది తర్వాత గత వారమే డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇదొక క్రైమ్ ఎలిమెంట్స్ తో కూడిన హారర్ థ్రిల్లర్ మూవీ. కేరళలోని వివిధ ప్రాంతాలలో అమ్మాయిలు అనుమానాస్పదంగా చనిపోతుంటారు. దీంతో ఈ మర్డర్స్ మిస్టరీని చేధించేందుకు సీనియర్ రేణుక అనే సిన్సియర్ పోలీసాఫీసర్ రంగంలోకి దిగుతుంది. విచారణలో ఆమెకు సంచలన విషయాలు తెలుస్తాయి.

ఈ హత్యల వెనుక ఏదో భయంకరమైన, అసాధారణమైన హారర్ అంశం దాగి ఉందని తెలుసుకుంటుంది. 1980లలో హంగేరీ, ఇతర దేశాలలో సేమ్ టు సేమ్ ఇలాంటి హత్యలు జరిగాయని కనుక్కుంటుంది. మరి ఈ హత్యల వెనక ఉన్నది ఎవరు? ప్రెగ్నెంట్ లేడీస్ ను టార్గెట్ చేసింది ఎవరు? అసలు ఆ హంతకుడి ఉద్దేశమేంటి? పోలీసులు ఈ కేసును ఛేదించారా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠభరిత సన్నివేశాలు, ఊహకందని ట్విస్టులతో సాగే ఈ సినిమా పేరు ఎల్. ఇదొక మలయాళం హారర్ థ్రిల్లర్ మూవీ. శోజి సెబాస్టియన్ తెరకెక్కించిన ఈ మూవీలో విష్ణు, అమృత మీనన్, బిగ్ బాస్-ఫేమ్ సంధ్య మనోజ్ తదితరులు నటించారు.
ప్రస్తుతం ఈ సినిమా మనోరమా మ్యాక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ అందుబాటులో లేదు కానీ.. ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ఈ మూవీని ఆస్వాదించవచ్చు. మరి ఐఎమ్ డీబీలో పదికి 9కి పైగా రేటింగ్ ఉన్న ఈ హారర్ థ్రిల్లర్ మూవీపై ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.